తలకోన జలపాతం
చిత్తూర్ జిల్లాలోని దట్టమైన అరణ్యంలో ఈ జలపాతం వుంది. సాక్షాత్తూ ఆదిశేషుడే పర్వత రూపం దాల్చాడని పురాణ గాథ. కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలిచి అలసిపోయి నిద్రపోయాడని చెబుతారు. అలా పడుకోవడంలో తలభాగం ఇక్కడ ఉన్న కొండ(కోన)శిఖరం మీద ఆనించాడని అందుకే ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. మన రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం కూడా ఇదే!