Hmda master plan maps available now

hmda, huda, hyderabad master plan, twin cities maps, govt of ap, andhra pradesh, hyderabad, secunderabad, movie news, film news, hyd mayor, congress government

hmda master plan maps available now

7.gif

Posted: 02/02/2013 02:31 PM IST
Hmda master plan maps available now

hmda_e

       గ్రేటర్ హైదరాబాద్ విస్తరిత ప్రాంతాల సవరణ మాస్టర్‌ప్లాన్-2031 సమాచారం అందుబాటులోకి వచ్చేసింది. మొదట చిత్రపటాల రూపంలో ప్రజల ముందుంచేందుకు హెచ్ఎండీఏ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేయటంతో ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. తార్నాకలోని హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంలో పని దినాల్లో ఉదయం 11నుంచి 4గంటల వరకు మండలాల వారీగా తీర్చిదిద్ధిన మ్యాప్‌లను చూసుకోవచ్చు. 35మండలాలకు సంబంధించిన ప్రణాళికను 32మ్యాప్‌ల్లో రూపొందించారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి డీవీడీ(ప్లాన్ సాఫ్ట్ కాపీ)లను కూడా విక్రయిస్తారు.
         కాగా,  ఐటీ, కన్వెక్షన్ సెంటర్, ఆంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు మెరుగైన మౌలిక వసతులున్న నగరంగా హైదరాబాద్ ఖ్యాతి గడించింది. ఈ అభివృద్ధిని మరింత శాస్త్రీయంగా చేపట్టేందుకు తాజా మాస్టర్ ప్లాన్ ఉపయోగపడుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ బహుళ ప్రయోజన జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వాణిజ్య, నివాస భవంతులతోపాటు ఐటీ, కార్పొరేట్ గోడౌన్లు, లాజిస్టిక్ హబ్స్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. ఈ ప్లాన్‌లో 13 అర్బన్ నోడ్స్‌ ను, 46 అర్బన్ సెంటర్లను ప్రతిపాదించారు. 2031నాటికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ రిజీయన్ పరిధిలో 1.85 కోట్ల జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళిక రూపొందించారు. పరిశ్రమల కోసం 209 ఎకరాలను కేటాయించారు.
      ఖానామెట్, ఇజ్జత్‌నగర్‌లలో ప్రత్యేక బిజినెస్ హబ్‌లను ఏర్పాటు చేయనున్నారు.  ఇప్పటికే హైటెక్ సిటీలో ఉన్న రైల్వే స్టేషన్‌ను పాదచారుల మార్కెట్‌కు అనుసంధానం చేసి ఓ బడా 'పెడస్ట్రీయన్ మార్కెట్' అభివృద్ధికి యత్నిస్తున్నారు. మొత్తం నగరాన్ని 'కన్వెక్షన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోంది. అలాగే కోకాపేట భూముల కేసులో హెచ్ఎండీఏకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రతిష్ఠాత్మకమైన 'ఐటీ - బిజినెస్' హబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Facebook twitter g craze
1st metro station at uppal next yr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more