Sardarji Jokes
ఫర్వాలేదు అంకుల్.. ఈరోజు నైటే పార్టీ!

ఒకరోజు సర్దార్ కార్పెట్ కొనుక్కోవడానికి బజారుకి వెళతాడు. తోడుగా తన మేనల్లుడు పప్పును కూడా తీసుకెళతాడు. 

సర్దార్ ఒక దుకాణదారుడి దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. 

సర్దార్ : ‘‘నాకు ఒక మంచి కార్పెట్ కావాలి. డబ్బు ఎంతైనా ఫర్వాలేదు’’

దుకాణదారుడు : ‘‘అలాగే నండి’’

ఇలా అని, దుకాణదారుడు రకరకాల కార్పెట్ లను సర్దార్ కు చూపిస్తాడు. 

చివరకు సర్దార్ ఒక మంచి రంగురంగుల కార్పెట్ ను ఎంచుకుంటాడు. 

సర్దార్ : ‘‘నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేనిప్పుడే దీనిని తీసుకెళతాను. ఒకవేళ ఇది నా రూమ్ లో సరిపోతే ఫర్వాలేదు. లేకపోతే వెనక్కు తీసుకొచ్చి నీకెచ్చేస్తాను. ఏమంటావ్’’

దుకాణదారుడు ఇతని మాటలు నమ్మి సరే అని అంటాడు. అప్పుడు 

దుకాణదారుడు : ‘‘మీరు ఒకవేళ దీనిని వెనక్కు తెచ్చివ్వాలి అనుకుంటే.. రేపు సాయంత్రం వరకు తీసుకుని రండి’’

ఇంతలో సర్దార్ మేనల్లుడు అయిన పప్పుగాడు దుకాణదారుడితో ఇలా అంటాడు.....

పప్పు : ‘‘ఏం ఫర్వాలేదు అంకుల్... మా ఇంట్లో పార్టీ ఈరోజు రాత్రే జరగబోతోంది!’’