Political Jokes
నాయకులు ఎంత అబద్ధం చెబుతారో మీకు తెలుసుకదా!

ఒకరోజు నాయకులు మొత్తం కలిసి ఒక బస్సులో ప్రచారం చేయడానికి బయలుదేరుతారు.

అనుకోకుండా వాళ్ల బస్సు రోడ్డు నుంచి తప్పి.. వ్యవసాయ పొలంలో వున్న ఒక చెట్టుకు ఢీ కొట్టుకుంటుంది.

అదే సమయంలో ఆ పొలం యజమాని అయిన రాము అక్కడికి చేరుకుంటాడు.

అక్కడ జరిగిన విషాదాన్ని చూసి అతను వెంటనే ఒక గొయ్యిని తొయ్యడం మొదలుపెడతాడు.

గొయ్యి మొత్తం తోసి.. యాక్సిడెంట్ అయిన నాయకులందరినీ అందులో పాతేస్తాడు.

ఇలా కొద్దిరోజుల తరువాత రాజకీయ నాయకుల బస్సు యాక్సిడెంట్ అయిన విషయం పోలీసులకు తెలుస్తుంది.

వెంటనే వారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి బస్సు యాక్సిడెంట్ అయిన చోటుకు చేరుకుంటారు.

అక్కడే వున్న రామును పోలీసులు కొన్ని ప్రశ్నలు వేస్తారు.

పోలీసులు : యాక్సిడెంట్ అయిన తరువాత బస్సులో వుండాల్సిన రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్లిపోయారు? నువ్వేమైనా చూశావా?

రాము : వాళ్లు ఎక్కడికి వెళ్లలేదు సార్. నేనే అందర్నీ ఖననం (పూడ్చడం, సమాధి) చేశాను.

పోలీసులు : రాజకీయ నాయకులు అందరూ ఒకేసారి చనిపోయారా?

రాము : లేదు సార్.. కొంతమంది ‘‘మేము చనిపోలేదు. మమ్మల్ని ఎవరైనా కాపాడండి’’ అని చెప్పారు. కానీ రాజకీయ నాయకులు ఎంత అబద్ధం చెబుతారో మీకు తెలుసా కదా సార్! అందుకే వాళ్లు చనిపోయినా.. చనిపోలేదు అని చెప్పుకున్నారు. నేను పూడ్చేశాను.

పోలీసులు షాక్స్... రాము రాక్స్!

నేనే మీకు 100 కోట్లు ఇస్తాను.. చేస్తారా?

ఒకసారి సోనియా గాంధీ కౌన్ బనేగా కరోడ్ పతి షోలో గేమ్ ఆడడానికి వెళుతుంది.

అమితాబ్ గారు ఎన్నో ప్రశ్నలు వేయగా.. సోనియా వాటన్నింటికీ సమాధానాలు చెబుతూ.. చివరి ప్రశ్న వరకు చేరుకుంటారు. అప్పుడు...

అమితాబ్ బచ్చన్ : సోనియాగారు.. ఇప్పుడు నేను 5 కోట్ల విలువచేసే చివరి ఆఖరి ప్రశ్నను అడగబోతున్నాను!

ప్రశ్న: గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు?

ఏ) లాలూ ప్రసాద్ బి) విలాస్ రావ్ దేశ్ ముఖ్ సి) అర్జున్ సిన్హ్ డి) నరేంద్రమోదీ

సోనియా గాంధీ : డి) నేంద్రమోదీ!

అమితాబ్ బచ్చన్ : మీరు చెప్పింది నిజమేనని మీరు నమ్ముతున్నారా?

సోనియాగాంధీ : అవును.. నేను చెప్పిన దానిలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను?

అమితాబ్ బచ్చన్ : అలా అయితే నరేంద్రమోదీని లాక్ చేసేయమంటారా?

సోనియాగాంధీ : మీరు అతన్ని లాక్ చేస్తే.. దానికి బదులుగా నేనే మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాను!

పాలిటిక్స్ అంటే ఏమిటి?

ఒక రోజు ఒక కొడుకు తన తండ్రితో ఈ విధంగా ప్రశ్నిస్తాడు.
కొడుకు : నాన్న.. ఈ పాలిటిక్స్ అంటే ఏమిటి?
తండ్రి : ఇంట్లో వున్న బాధ్యతలన్నీ మీ అమ్మ చూసుకుంటుంది. ఆమెను ప్రభుత్వం అనుకో!
నేను సంపాదిస్తాను కాబట్టి నన్ను ఉద్యోగస్తుడు (ఎంప్లాయి) అనుకో!
ఇంట్లో వున్న పనిమనిషి శ్రమతో పనిచేస్తుంది కాబట్టి ఆమెను లేబర్ అనుకో!
నీకు నువ్వుగా దేశప్రజలు అనుకో!
నీ చిన్న తమ్ముడిని దేశ భవిష్యత్తు అనుకో!
కొడుకు : ఇప్పుడు నాకు పాలిటిక్స్ అంటే ఏమిటో అర్థం అయిపోయింది.
నిన్నరాత్రి నేను ఒక ఉద్యోగస్తుడిని ఇంట్లో వున్న లేబర్ తో కిచెన్ లో ఎంజాయ్ చేస్తుండగా చూశాను.
ఆ సమయంలో ప్రభుత్వం నిద్రపోతోంది.
దేశప్రజలకు ఎటువంటి అభ్యంతరం లేదు.. కానీ దేశ భవిష్యత్తు మాత్రం ఏడ్చుకుంటూ కూర్చుంది!

లెటర్ సరియైన చోటుకే చేరుకుంది!

ఒకరోజు ఒక రాజు అనే నేత తన విజయ్, విక్రమ్ అనే సహనేతలతో కూర్చొని తనకొచ్చిన లేఖల (మెయిల్స్) ను చదువుతున్నాడు. 

అప్పుడు రాజు అనే మంత్రి అనుకోకుండా గట్టిగా అరుస్తూ... ‘‘ఇదిగో ఈ లేఖను చూడండి. ఈ లేఖపై ఈ రాజ్యంలోనే వున్న పనికిరాని నేత అయిన విక్రమ్ పేరు మీద రాసి వుంది.’’ 

దీంతో అక్కడున్న రాజు అనే నేత విక్రమ్ ని శాంతపరుస్తుండగా.. విక్రమ్ ఇలా అంటాడు... ‘‘అయినా ఇంత ధైర్యం ఎవడి చేసి వుంటాడు.. మీ ఇంటి రాసి మా ఇంటికి పంపించాడేంటి’’

ఈ మాటలు విన్న విజయ్ బాధపడుతూ ఇలా అంటాడు.. ‘‘నువ్వు చెప్పినందుకు నాకు బాధైతే కలుగలేదు కానీ.. ఆ పోస్ట్ మాన్ మాత్రం కరెక్ట్ ఇంటికే ఈ పత్రాన్ని తీసుకొచ్చాడు.

తెలివైన నాయకుడు!

ఒక రోజు ఒక మంత్రి ఇంటికి లేఖ వస్తుంది. అప్పుడు ఆ మంత్రి ఆ లేఖను ఓపెన్ చేసి చూస్తే.. అందులో కేవలం ‘‘మూర్ఖుడు’’ అని రాసి వుంది. అది చూసి మంత్రి చాలా బాధపడ్డాడు. 

తరువాతి రోజు పత్రకారులు న్యూస్ విభాగంలో ఆ మంత్రితో ఇలా అడిగారు... ‘‘నిన్న మీకు వచ్చిన లేఖలో కేవలం ‘‘మూర్ఖుడు’’ అని వ్రాసి వుంది. దీనిమీద మీ అభిప్రాయమేంటి?’’

అప్పుడు మంత్రి ఇలా అంటాడు... ‘‘చూడండి! ఎవరైతే నాకు లేఖలు రాసి పంపిస్తారో.. వాళ్లందరు తమ అభిప్రాయాలను లేఖలో రాసి, పేర్లు రాయకుండా వుంటారు. కానీ నాకు నిన్న మొదటిసారి ఒక లేఖ వచ్చింది.. అందులో ఎవరో తన పేరును మాత్రమే రాసి.. అభిప్రాయం రాయకుండా పంపించాడు.’’

మిగతా 99 రూపాయలు ఎక్కడ..?

ఒకరోజు ఒక కాంగ్రెస్ మంత్రి ప్రసంగం చేస్తూ ఒక చిన్న కథను వినిపిస్తాడు. 

కథ : ఒక వ్యక్తికి ముగ్గురు కొడుకులు వుండేవారు. అతడు ఆ ముగ్గురిలో ఒక్కొక్కరికి 100 - 100 - 100 రూపాయలు ఇచ్చాడు. 

ఆ వంద రూపాయలతో ఒక రూమ్ నిండా సరిపడేంత వస్తువు ఏదైనా వుంటే తీసుకుని రమ్మని చెప్పాడు. 

మొదటి కొడుకు 100 రూపాయలతో పచ్చగడ్డి తీసుకుని వచ్చాడు... కానీ అది రూమ్ నిండా సరిపోలేదు. 

రెండవ కొడుకు 100 రూపాయలతో పత్తి (దూది) తీసుకువచ్చాడు... అది కూడా రూమ్ నిండా సరిపోలేదు. 

మూడవ కొడుకు ఇచ్చిన 100 రూపాయలలో కేవలం 1 రూపాయితో కొవ్వొత్తి తీసుకువచ్చాడు. దాంతో ఆ రూమ్ మొత్తం ప్రకాశవంతంగా వెలిగి సరిపోయింది. 

ఈ విధంగా ఆ మంత్రి కథను చెబుతూ ఇలా అంటాడు. 

మన రాహుల్ గాంధీ ఆ కథలో చెప్పినట్లుగా మూడవ కొడుకు లాంటివాడు. ఏరోజు నుంచి అయితే అతను రాజకీయాల్లోకి వచ్చాడో... ఆరోజునుంచి మన దేశం ప్రకాశవంతంగా, సమృద్ధిగా మెలుగుతోంది. 

మంత్రి తన ప్రసంగాన్ని ఈ విధంగా కొనసాగిస్తుండగా.. ఇంతలో వెనక నుంచి అన్నాహజారే గొంతు వినిపిస్తుంది. 

అన్న హజారే : ఆ ఒక్క రూపాయితో కొవ్వొత్తి తీసుకువచ్చి వెలుగు తీసుకొచ్చాడు సరే.. మిగతా 99 రూపాయలు ఎక్కడున్నాయి..?

దీని అర్థం ఏంటో తెలుసా దయా!

ఒకరోజు మన్మోహన్ సింగ్ ప్రసంగంలో మాట్లాడుతుండగా.. సీఐడీ ఆఫీసర్స్ ఈ విధంగా చర్చించుకుంటున్నారు. 

మన్మోహన్ సింగ్ : ‘‘వేలాది ప్రశ్నలకు జవాబులు చెప్పడం కంటే.. నా మౌనమే చాలా మంచిది. నేనింతవరకు ఎన్ని ప్రశ్నలకు జవాబులివ్వకుండ వున్నానో నాకే తెలియదు’’. 

ఫ్రెడ్రిక్స్ : ‘‘సార్ చూడండి... మన్మోహన్ సింగ్ గారూ ప్రసంగంలో ఏదో చెబుతున్నారు’’.

ఏసీపీ ప్రద్యుమన్ : ‘‘ఓ మై గాడ్! దీని అర్థం ఏంటో తెలుసా దయా..?’’

దయా : ‘‘ఆ ఏసీపీ సార్ గారూ.. నేను అర్థం చేసుకున్నాను. దీని అర్థం ఏంటంటే.. మన్మోహన్ సింగ్ గారూ కూడా మాట్లాడగలరు’’.

ఈ మాట వినగానే ఏసీపీ ప్రద్యుమన్ ఏం చెబుతారోనని చుట్టుపక్కల అభిజీత్, ఇంకా వేరే ఆఫీసర్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. 

ఏసీపీ ప్రద్యుమన్ : ‘‘లేదు దయా... దీని అర్థం ఇది కాదు.. దీని అర్థం ఏంటంటే.. సోనియాగాంధీగారు మన్మోహన్ సింగ్ ని ఏదో చెప్పమని ఆర్డర్ ఇచ్చారు.’’