సగం సగం పనులు తాను చేయలేనని, తాను పోషించిన పాత్రలకు మరొకరు డబ్బింగ్ చెప్పడం తనకు ఇష్టముండదని చెబుతోంది ‘ఫ్యాషన్’భామ ముగ్ధాగాడ్సే. అందుకే రితూపర్ణ ఘోష్, అపర్ణాసేన్ల చిత్రాల్లో నటిస్తున్న తాను బెంగాలీ నేర్చుకుంటున్నానని, అందుకోసం ఏమైనా చేస్తానంటోంది. కోల్‌కతాలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ముగ్ధా అనంతరం వివరాలను వెల్లడించింది. ఇక్కడ నిర్వహించిన ఫ్యాషన్ షోలో డిజైనర్ దితియా రాయ్ రూపొందించిన ఓ గౌన్‌ను ధరించిన ముగ్ధా షో టాపర్‌గా నిలిచింది. అపర్ణాసేన్ తెరకెక్కించిన చిత్రం ‘గోయ్నార్ బాక్షో’ చిత్రానికి విశేష స్పందన లభిస్తోందని, సబ్ టైటిల్స్‌తో చూసే సదుపాయం ఉన్నందున ఆ సినిమాను తాను కూడా చూస్తానని చెబుతోంది. బెంగాలీ నేర్చుకునేందుకు ఇదికూడా కొంత సాయపడుతుందనే అభిప్రాయాన్ని ముగ్ధా వ్యక్తం చేసింది.
ఇక రీతూపర్ణ ఘోష్ నటించిన ‘చాకర్ బాలి’ చిత్రం కూడా అద్భుతంగా ఉందని, అందులో ఐశ్వర్యరాయ్ ఉండడం కారణంగా సినిమాను మరింత ఇష్టపడి చూశానని చెప్పింది. పస్తుతం తాను హిందీలో రెండు సినిమాల్లో నటిస్తున్నానని, ‘అఫ్రా తఫ్రీ’, ‘ఓహ్ గాడ్! సారే హై ఫ్రాడ్’ సినిమాలు తప్పకుండా తనకు మంచి గుర్తింపును తెస్తాయని చెప్పింది. మోడల్‌గా కూడా తన కెరీర్ సంతృప్తికరంగా ఉందని, నటిగా కూడా వివిధ భాషల్లో అవకాశాలు వస్తున్నాయని చెప్పింది. అయితే తాను కేవలం హిందీ సినిమాలకే అంకితమైపోకుండా బెంగాలీ, మరాఠీ చిత్రాల్లో కూడా నటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. డిజైనర్ దితియా రాయ్ రూపొందిస్తున్న దుస్తులు అద్భుతంగా ఉంటున్నాయని, అవి కూడా తనకు మరింత గుర్తింపును తెస్తున్నాయని చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more