Teluguwishesh 19.gif 19.gif ko ante koti movie review Product #: 41006 stars, based on 1 reviews
  • Movie Reviews
    ko-ante-koti-poster-designs1ee

    చిత్రం పేరు     :     'కో అంటే కోటి'
    విడుదల తేదీ  :  28.12.2012
    బ్యానర్         : శర్వా ఆర్ట్స్
    సంగీతం        : శక్తికాంత్ కార్తీక్
    నిర్మాత        : మైనేని వసుంధరాదేవి
    దర్శకత్వం     : అనీష్ యోహాన్ కురువిల్లా
    నటీనటులు    : శర్వానంద్, శ్రీహరి, ప్రియా ఆనంద్
    తెలుగువిశేష్.కాం రేటింగ్ : 2.50


    పరిచయం :

           మూస చిత్రాలకు ఎప్పుడూ దూరంగా ఉండే యంగ్ హీరో శర్వానంద్ కథ నచ్చి సొంతంగా నిర్మించిన సినిమా ‘కో అంటే కోటి’. శర్వానంద్-ప్రియా ఆనంద్ జంటగా నటించిన ఈ సినిమాలో రియల్ స్టార్ శ్రీహరి ప్రధాన పాత్ర పోషించారు. అవకాయ్ బిర్యాని ఫేం అనీష్ కురివిల్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..

    చిత్రకథ :

           ఈ స్టోరీ ప్రధానంగా ఒక దోపిడీకి సంబంధించింది. మాయా మాస్టర్ అలియాస్ మయలోరి మదన్ (శ్రీహరి) ఒక చిల్లర దొంగ. ఈ క్రమంలో జైలు పాలైన శ్రీహరి భారీ దోపిడీ చేసి జీవితంలో సెటిలైపోవాలనే తపనతో డైమండ్ హౌస్ లో ఉన్న బ్లాక్ మనీ దోచేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం తన టీంలో చిట్టిగాడు (లక్ష్మణ్), బుజ్జిగాడు (నిశ్చల్) ను సెట్ చేస్తాడు.

           ఇక హీరో వంశీ(శర్వానంద్) దొంగతనాలపై విరక్తి చెంది సత్య (ప్రియా ఆనంద్) ని పెళ్లి చేసుకుని మంచి మనిషిగా బతకాలనుకుంటాడు. అయితే అందుకు డబ్బు కావాలి.. ఒకే ఒక పేద్ద రాబరీ చేసి లైఫ్ లో సెటిల్ అవ్యవాలని ఇష్టం లేకపోయినా శ్రీహరి టీంలో జాయిన్ అవుతాడు.

           అయితే, దోపిడీ చేసి పారిపోతుండగా, కథ టర్న్ తీసుకుంటుంది. అనుకోని ప్రమాదం సంభవించి.. ఒకరినొకరు మోసగించుకుంటారు. ఈ మోసాల పరంపర ఎలాసాగింది. చివరికి డబ్బెవరికి దక్కిందనేది తెరమీదే చూడాలి.

    విశ్లేషణ :

           దారుణమైనస్ర్కీన్ ప్లే,  పూర్ డైరెక్షన్, వీక్ క్యారెక్టరైజేషన్ ‘కో అంటే కోటి’ లోని ప్రధానలోపాలు. శర్వానంద్, ప్రియా ఆనంద్ మధ్య ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా స్లో.  వీరి ప్రేమ పండించడానికి చేసిన నాటకాల సన్నివేశం ఆకట్టుకోలేదు. చిట్టిగాడు లవ్ ట్రాక్,  బుజ్జిగాడితో డిల్లీ బెల్లీ కామెడీ విసుగుపుట్టించాయి. ఫింగర్ ఫెడ్రిక్స్ విలనిజం తేలిపోయింది. సినిమాలోని అత్యంత కీలకమైన రాబరీ సన్నివేశంలోనే దర్శకుడి లోపాలు తలెత్తాయి. క్లైమాక్స్  పర్వాలేదు.

    నటీనటుల పనితీరు :

            శర్వానంద్ నటనలో మరింత పరిణితి కనబరిచి తనపాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన విభిన్న తరహా పాత్రల ఎంపిక సరైందేనని అనిపించగలిగాడు. ప్రియా ఆనంద్ తన పరిధిమేరకు బాగా నటించింది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ సీన్స్ ఆహ్లాదంగా సాగాయి. రియల్ స్టార్ శ్రీహరి మూవీలో చాలా కీలకభూమిక పోషించి రక్తి కట్టించాడు. అతని డైలాగ్స్ బానే పేలాయి. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ పాత్ర చేసిన వినయ్ వర్మ ఓకే. మిగతా నటీనటులు తమ పాత్రలకు అనుగుణంగా చేసుకుంటూపోయారు.

    సాంకేతిక విభాగం :

            తొలి సినిమా అవకాయ్ బిర్యాని లో చేసిన పొరపాట్లే దర్శకుడు అనీష్ కురివిల్లా ఇందులోనూ చేశాడు. ఫస్టాఫ్ చాలా స్లోగా నెరేట్ చేసి సహనాన్ని పరీక్షించాడు. సినిమాటోగ్రఫీ చాలా వరకూ బావుందనే చెప్పాలి. ఎడిటింగ్ అస్తవ్యస్తంగా సాగింది. శక్తి కాంత్ కార్తీక్ సంగీతంలో వరాల వాన, కో అంటే కోటి పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం ఓకే. ప్రవీణ్ బోయిన రాసిన కొన్ని డైలాగ్స్..‘నీదేం పోయింది..గుడ్డుపెట్టే కోడికి తెలుస్తుంది గుండె నొప్పి’ లాంటి కొన్ని డైలాగ్స్ బాగా పేలాయి.

    ఉపసంహారం :

           కో అంటే కోటి అనుకుంటే పొరపాటే..వందలూ.. వేలే...

    ...avnk


More Movie Reviews
More
Get information about Karthikeya 2 Telugu Movie Review, Nikhil Siddharth Karthikeya 2 Movie Review, Karthikeya 2 Movie Review and Rating, Karthikeya 2 Review, Karthikeya 2 Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Bimbisara Telugu Movie Review, Kalyan Ram Bimbisara Movie Review, Bimbisara Movie Review and Rating, Bimbisara Review, Bimbisara Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com
Get information about Ante Sundaraniki Telugu Movie Review, Nani Ante Sundaraniki Movie Review, Ante Sundaraniki Movie Review and Rating, Ante Sundaraniki Review, Ante Sundaraniki Videos, Trailers and Story and many more on Teluguwishesh.com