Chiru, Salman take the stage in GodFather promo మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాద‌ర్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో..

Godfather chiranjeevi salman khan take the stage in godfather first single promo

Megastar, Chiranjeevi, God Father, salman khan, Thaar maar thakkar maar, Nayanthara, Puri Jagannadh, Satya Dev, first single, godfather Chiranjeevi first single, godfather salman khan Chiranjeevi single, godfather movie, godfather Chiranjeevi movie, godfather songs, Mohan Raja, Thaman, Tollywood, Movies, Entertainment

Chiranjeevi and Salman Khan will be seen together in GodFather, one of the most eagerly-awaited Telugu films of the year. The flick has garnered a fair deal of attention as it features the Tollywood Megastar in a new avatar. Now, here is an exciting update for those looking forward to the biggie. Its first single will be out at 5:05 pm today, September 13.

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాద‌ర్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో..

Posted: 09/13/2022 05:42 PM IST
Godfather chiranjeevi salman khan take the stage in godfather first single promo

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద పెద్దగా సవ్వడి చేయకుండానే మెగా ఫ్యాన్స్ ను నిరుత్సాహపర్చినా.. వారిని ఉత్తేజపర్చేందుకు ఆయన సిద్దం అవుతున్నాడు. తానేంటో, తన నట విశ్వరూపమేంటో చూపేందుకు తన తదుపరి చిత్రం ‘గాడ్‌ ఫాద‌ర్‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ నుండి ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ వ‌ర‌కు అన్ని సినిమాపై అంత‌కంత‌కు అంచ‌నాల‌ను పెంచుతూనే ఉన్నాయి. మొహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది.

పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుసగా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో బిగ్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. చిరు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గాడ్‌ఫాద‌ర్’ ఫ‌స్ట్ సింగిల్ డేట్ వ‌చ్చేసింది. గాడ్‌ఫాద‌ర్ ఫ‌స్ట్ సింగిల్‌ను సెప్టెంబ‌ర్ 15 సాయంత్రం 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన ప్రోమోను ఇవాళ విడుదల చేశారు.

ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు థార్ మార్ థక్కర్ మార్ అంటూ సాగే సింగిల్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ వార్త‌తో మెగా అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రం మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన లూసీఫ‌ర్‌కు రీమేక్‌గా తెర‌కెక్కింది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. స‌ల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుండ‌గా స‌త్య‌దేవ్, న‌య‌న‌తార కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles