Bimbisara Worldwide Pre-Release Business report తెలుగు రాష్ట్రాలలో 685 థియేటర్లలో ‘బింబిసార’ విడుదల

Bimbisara box office prediction pre release business and break even point

Bimbisara, Trailer, Nandamuri Kalyan Ram, CatherineTresa, Samyuktha Menon, Warina Hussain, Vennela Kishore, Brahmaji, Srinivasa Reddy, Vassishta, Hari Krishna K, M. M. Keeravani, NTR Arts, Aug 5th, pre-release business, Tollywood, Movies, Entertainment

Nandamuri Kalyan Ram’s most expensive outing to date, “Bimbisara” is all set to hit the theatres this Friday. It has created quite a buzz ahead of the release through the posters, teaser, and trailer. The worldwide pre-release business of the film is valued at Rs 15.60 Cr, hence it needs to raise around Rs 16.20 Cr shares at the ticket counters worldwide to emerge as a hit venture. The Break Even point will be around Rs 14 Cr in Telugu states.

తెలుగు రాష్ట్రాలలో 685 థియేటర్లలో ‘బింబిసార’ విడుదల

Posted: 08/04/2022 06:45 PM IST
Bimbisara box office prediction pre release business and break even point

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు. టైటిల్ రోల్ ప్లే చేస్తూ కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ‘బింబిసార’ టీజర్, ట్రైలర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు చిత్రంపై అంచనాలు కూడా అమాంతం పెంచాయి. ఈ నెల 5న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్, ఎన్ని స్ర్కీన్స్ పై విడుదల కానుంది. వాటిలో తెలుగు రాష్ట్రాల ధియేటర్ల సంఖ్య ఎంత అన్న వివరాలు ఇలా ఉన్నాయి.

ప్యాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ బింబిసార చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కించారు. ఈ పిరియాడిక్ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేయగా.. ఇక ఈ చిత్ర నిడివి 2 గంటల 26 నిమిషాలగా ఉంది. సినిమా రిచ్ గా, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉందని, ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉందని సెన్సార్ వాళ్లు చెప్పుకొచ్చారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు.

కళ్యాణ్ రామ్ బింబిసార ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ) రూ. 5 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) రూ. 2 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ రూ. 6.50 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 13.50 కోట్లు.. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 1.1 కోట్లు.. ఓవర్సీస్ - రూ. 1 కోటి రూపాయలు టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 15.60 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ. 16.20 కోట్లు రాబట్టాలి. ఇదిలాఉండే చిత్రం రూపోందించడానికి అయిన బడ్జెట్ మొత్తం ఏకంగా రూ. 40 కోట్లుగా చిత్రవర్గాలు నుంచి సమాచారం. ఇక ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో ఏకంగా 685 థియేటరల్లో అడనుంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 975 స్ర్కీన్స్ పై చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles