Veteran Bengali singer Sandhya Mukherjee dies at 90 బెంగాలీ గానకోకిల సంధ్య ముఖర్జీ కన్నుమూత

Bengali singer sandhya mukhopadhyay whose golden voice enthralled generations passes away at 90

sandhya mukherjee, sandhya mukhopadhyay, singer sandhya mukherjee dies, sandhya mukhopadhyay dies, sandhya mukhopadhyay passes away, Sandhya Mukherjee, bengali singer, cinema, films, padma shri, sandhya mukherjee dies, mamata banerjee, Kolkata, West Bengal, Kolkata news

Veteran Bengali singer Sandhya Mukhopadhyay, whose golden voice enthralled music lovers for generations and who had last month refused to accept the Padma Shri, passed away in Kolkata following a massive cardiac arrest. She was 90. Mukhopadhyay was hospitalised on January 27 after she developed heart- and lung-related complications following Covid-19 infection.

బెంగాలీ గానకోకిల సంధ్య ముఖర్జీ కన్నుమూత

Posted: 02/16/2022 12:14 PM IST
Bengali singer sandhya mukhopadhyay whose golden voice enthralled generations passes away at 90

భారత సినీచరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంధ్య ముఖర్జీ​ తుదిశ్వాస విడిచారు. మరీముఖ్యంగా బెంగాలీ సంగీత ప్రియులను అమె మరణవార్త విషాదంలోకి నెట్టింది. అనారోగ్య సమస్యలతో 91 ఏళ్ల ఆమె కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించడంతో ఇటీవల వార్తల్లో నిలిచిన అమె.. నిన్న రాత్రి కన్నుమూశారు. దక్షిణ కోల్ కతాలోని తన ఇంట్లో స్నానాలగదిలో కాలు జారీ కిందపడిన అమెను కుటుంబసభ్యులు గత నెల 27న అసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించగా అప్పటి నుంచి అమె అసుపత్రిలోనే చికిత్స పోందుతున్నారు.

సంధ్య ముఖర్జీకి చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్టుగానూ నిర్ధారణ అయింది. అలాగే, అవయవాలు సరిగా పనిచేయకపోవడమేకాక ఎముక విరిగినట్టు కూడా వైద్యులు గుర్తించారు.  దీంతో గత రాత్రి ఏడున్నర గంటల సమయంలో సంధ్య ముఖర్జీ​ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో చిత్రసీమలో ఎన్నో సూపర్ హిట్​ పాటలు పాడిన మరో గొంతుక మూగబోయింది. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పశ్చిమ బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

1931 అక్టోబర్​ 4న బంగాల్​లోని కోల్​కతాలో జన్మించారు సంధ్య. 'అన్జాన్​ గర్హ్'​ సినిమాతో కెరీర్​ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు సూపర్​ హిట్​ పాటలు పాడారు. పశ్చిమ బంగాలోని రాష్ట్ర అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఎస్‌డీ బర్మన్, నౌషాద్, సలీల్ చౌధురి వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసిన సంధ్య.. బంగ్ బిభూషణ్, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles