Bheemla Nayak locked two dates for the release భీమ్లా నాయక్ విడుదల ఆ రెండు రోజుల్లోనే.!

Pawan kalyans bheemla nayak locked two dates for the release

bheemla nayak, bheemla nayak release date, release date, February 25, April 1, trivikram, the sound of bheemla, samyuktha, saagar k chandra, rana daggubati, pawan kalyan, nithya menen, la la bheemla, bheemla nayak, Tollywood, Movies, Entertainment

Saagar K Chandra’s much-awaited Bheemla Nayak, starring Pawan Kalyan and Rana Daggubati in the lead roles, planning to release the movie in February if the corona virus omicron variant conditons be better, or else it might release the movie in the month of April. The makers of the Telugu remake of Malayalam hit Ayyappanum Koshiyum announced the both the dates.

పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ విడుదల ఆ రెండు రోజుల్లోనే.!

Posted: 01/31/2022 09:13 PM IST
Pawan kalyans bheemla nayak locked two dates for the release

టాలీవుడ్ పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ్లా నాయక్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.? అని అభిమానులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వకీల్ సాబ్ చిత్రంతో మంచి హిట్ అందుకుని జోరుమీదున్న పవన్ కల్యాణ్ బీమ్లానాయక్ తో మరో వరుస హిట్ కోట్టాలని కృతనిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల ముందుకు వచ్చి రికార్డులను తిరగరాయాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా తప్పలేదు.

పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ‘భీమ్లా నాయక్’ నుంచి విడుదలైన పాటలు ఓ వైపు అలజడి సృష్టిస్తున్నాయి. ఇక ‘లాలా భీమ్లా’ అన్న సాంగ్ కూడా గూస్ బంప్స్ తెప్పించే బీట్‌తో ఆకట్టుకుంది. మలయాళంలో సూప‌ర్ హిట్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌గా వ‌స్తున్న ఈ మూవీ 2022 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సివుండగా, తాజాగా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు చిత్రబృందం రెండు తేదీలను ఖరారు చేసుకుంది. భీమ్లా నాయ‌క్‌లో కోలీవుడ్ భామ నిత్యా మీనన్ మాలీవుడ్ భామ సంయుక్తా మీన‌న్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో న‌టిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh