SS Rajamouli Releases Ram Charan's Alluri look అర్ఆర్ఆర్ నుంచి అల్లూరి లుక్.. ఇడుగో ఇతడే నా అల్లూరి..

Ss rajamouli releases ram charan s alluri look from period epic rrr

RRR, RRR release date, RRR new release date, SS Rajamouli, Jr NTR, Ram Charan, RRR October 13 2021, RRR, ajay devgn, RRR shooting, ajay devgn in RRR, ajay devgn pics, Ram charan, NTR, Tarak, Rajamouli, Tollywood, movies, entertainment

The motion poster of the upcoming period action film RRR starring Ram Charan as Alluri Seetharama Raju is out. The movie is directed by SS Rajamouli and produced by DVV Danayya under the banner of DVV Entertainments. Ram Charan and Jr NTR are playing lead roles in the flick.

అర్ఆర్ఆర్ నుంచి అల్లూరి లుక్.. ఇడుగో ఇతడే నా అల్లూరి..

Posted: 03/26/2021 04:00 PM IST
Ss rajamouli releases ram charan s alluri look from period epic rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ పై తాజాగా ఓ అప్ డేట్ అందిస్తామని చెప్పిన చిత్ర యూనిట్.. ఇవాళ ఏకంగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను అందించింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఇచ్చారు. బాహుబలి సిరీస్ చిత్రాల కన్నా ముందు నుంచే ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు రాజమౌళి. దీంతో ఇవాళ మెగా అభిమానులు ఆశించిన విధంగా తన చిత్రంలో అల్లూరి సీతారామరాజును లుక్ ను విడుదల చేశారు.

ఈ లుక్ లో అచ్చంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును తలపించినట్టే వున్నారు రాంచరణ్ తేజ్. పసుపు వర్ణంలోని ఉదయపు సూర్యుడు ఉదయిస్తున్న వేళ.. అగ్గిపర్వతం బద్దలైన అగ్నికీలల వెలుతురులో ఓ చేత్తో విల్లునును ఎక్కుబెట్టి.. మరోచెత్తో బాణాన్ని లాగి.. లక్ష్యాన్ని గురిపెట్టిన బాణం వదిలేందుకు సిద్దంగా వున్న అల్లూరి సీతారామారాజు లుక్ ను విడుదల చేసిన జక్కన్న.. ఇడుగో ఇతడే నా అల్లూరి సీతారామరాజు అంటూ క్యాషన్ పెట్టారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘#RRR’పై నెలకొన్న అంచనాలే కాదు లుక్ అంచనాలు కూడా అదిరిపోతాయన్న విషయం తెలిసిందే.

'ధైర్యం, ఆత్మగౌరవం, పరిపూర్ణత కలిగిన వ్యక్తి... ఇడుగో.. ఇతడే నా అల్లూరి సీతారామరాజు 'అంటూ రాజమౌళి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. కాగా, సోషల్ మీడియాలో ఈ అప్ డేట్ ను పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే వేల సంఖ్యలో రీట్వీట్లు, లైకులతో అభిమానులు హోరెత్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా షెడ్యూల్ ప్రకారం గతేడాది జులై 30న విడుదల కావాల్సివున్నా కరోనా కష్టకాలం నేపథ్యంలో చిత్ర విడుదల వాయిదాలు పడుతూ చివరకు దసరా అక్టోబర్ 13న చిత్రాన్ని దసరా కానుకగా ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles