తెలుగు ప్రేక్షకులకు 'ఒరేయ్ పండు', 'మౌనమేలనోయి', 'జాక్ పాట్' తదితర చిత్రాలతో సుపరిచితుడైన నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త సచిన్ జోషిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అటు బాలీవుడ్ ప్రపంచంతో పాటు ఇటు టాలీవుడ్ కు కూడా పరిచయమున్న ఈ నటుడు.. కింగ్ ఫిషర్ అధినేత, ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు చెందిన సకల వసుతులతో కూడిన గోవా విల్లాను.. బ్యాంకులు విజయ్ మాల్యా అస్తుల వేలం వేయడంతో ఆయన కొనుగోలు చేశారు.
అప్పట్లోనే ఆయన వార్తల్లో నిలువుగా.. తాజాగా మరోమారు ఆయన తన అరెస్టుతో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఈడీ విచారిస్తున్న ఓమ్ కార్ రియల్టర్స్ కేసులో జేఎం జోషి గ్రూప్ ప్రమేయాన్ని నిర్ధారించుకున్న ఈడీ అధికారులు, తదుపరి విచారణ కోసం సచిన్ జోషిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఓమ్ కార్ గ్రూప్ ప్రమోటర్లలో సచిన్ జోషి కూడా ఉన్నాడు. దాదాపు 100 కోట్ల రూపాయల నిధులను వీరు కాజేశారని ఆరోపణలు ఉన్నాయి.
అంతకుముందు దాదాపు 18 గంటల పాటు సచిన్ జోషిని విచారించిన ఈడీ అధికారులు, ఆపై అరెస్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కాగా, గోవాలో విజయ్ మాల్యా సొంతమైన కింగ్ ఫిషర్ విల్లాను గతంలో జోషి కొనుగోలు చేశాడు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్ లు, క్లబ్ లను కలిగివున్న ప్లేబాయ్ ఫ్రాంచైజీని కూడా నిర్వహిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more