Veteran actor Raavi Kondala Rao no more కళామతల్లి ముద్దుబిడ్డ రావికొండల రావు కన్నుమూత

Veteran telugu actor and writer raavi kondal rao passes away at 88

Raavi kondala rao, actor, journalist, chandamama vijaya combines, pelli pustakam, brundavanam

Popular veteran actor Raavi Kondala Rao died of heart attack on Tuesday evening while undergoing treatment at a private hospital in Somajiguda. He was 88. His wife Radha Kumari, well-known actor and his co-star in nearly 100 films, died in 2012.

టాలీవుడ్ లో విషాధం.. రావికొండల రావు కన్నుమూత

Posted: 07/28/2020 09:25 PM IST
Veteran telugu actor and writer raavi kondal rao passes away at 88

తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం అలుముకుంది. ఆరు దశాబ్దాల పాటు సినీకళామతల్లికి సేవలు అందించిన కళామతల్లి ముద్దుబిడ్డ, ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, దర్శకనిర్మాత, సాహితీవేత్త, పాత్రికేయుడు రావి కొండలరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు. నగరంలోని బేగంపేటలో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో హృద్రోగంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ రావి కొండలరావు మరణం సినీ, నాటక రంగాలకు తీరని లోటుగా పేర్కొన్నారు. తమ నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1932లో జన్మించిన రావి కొండలరావు సుకుమార్ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు. నాటికలు, నాటకాలు కూడా రచించారు. 2004లో ఆయన రచించిన బ్లాక్ అండ్ వైట్ అనే పుస్తకం తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారానికి ఎంపికైంది. భైరవద్వీపం, బృందావనం చిత్రాలకు సంభాషణలు, పెళ్ళి పుస్తకం చిత్రానికి కథ అందించారు. తమిళ, మలయాళ చిత్రాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆయన సతీమణి దివంగత రాధాకుమారి కూడా ప్రముఖ నటి. అమె కూడా సినీరంగానికి సేవలందిస్తూ 2012లో పరమపదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raavi kondala rao  actor  journalist  chandamama vijaya combines  pelli pustakam  brundavanam  

Other Articles