Tamil Actor Arrested In Chennai For Gambling నటుడు కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

Tamil actor arrested in chennai for gambling tokens found at flat cops

Actor arrest, actor shaam arrest, actor shaam gambling, gambling, actor shaam, Chennai lockdown, Tamil Actor shaam, kick shaam, chennai police, nungambakkam, chennai, kollywood, tollywood, movies, entertainment

The police have arrested 12 people, including popular actor Shaam, for alleged gambling activity at his apartment near the upscale Nungambakkam area in Chennai. Investigators said tokens used for gambling have been recovered from the flat owned by the actor

నటుడు కిక్ శ్యామ్ ను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు

Posted: 07/28/2020 09:07 PM IST
Tamil actor arrested in chennai for gambling tokens found at flat cops

సినీపరిశ్రమలో సెలబ్రిటీలుగా ఎదగడానికి చక్కని గుర్తింపుతో పాటు ప్రేక్షకాదరణ పోందడానికి ఎంతో పెట్టి పుట్టాలి. అయితే కొందరు ఎలాంటి కష్టం లేకుండానే దానిని సంపాదించుకుంటారు. మరికోందరు మాత్రం దానిని సంపాదించడానికి అహర్నిశలు కష్టపడతారు. మొత్తానికి ఎంతో కష్టపడి సెలబ్రిటీ స్టేటస్ పోందిన వీరు.. దానిని పోందిన తరువాత నిలబెట్టుకోవడానికి మరెంతగానో కష్టపడాల్సి వస్తుంది. ఎక్కడ ఎలా వ్యవహరించాలని, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, మీడియాతో ఎప్పుడు మాట్లాడాలి, అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఎలా తప్పించుకోవాలి అన్నవి తమ వ్యక్తిగతానికి, వృత్తిపర జీవితానికి ఎలాంటి అపఖ్యాతి రాకుండా మసలుకోవాలి.

ఇలా నిత్యం తమ సెలబ్రిటీ స్టేటస్ ను కాపాడుకుంటూ తమ గమనం సాగించాల్సి వుంటుంది. అయితే రహస్యంగా తాము ఎలాంటి పనులు చేసినా పట్టుబడమని భావించి తప్పులు చేస్తే చిక్కిన తరువాత ఇమేజ్ కు వచ్చే డ్యామేజీ అంతాఇంత కాదు. ఎలాగంటే.. తెలుగులో కిక్, రేసుగుర్రం సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన సోంత ప్లాటులో సినీరంగానికి చెందిన పలువరితో కలసి పేకాట అడుతున్నారన్న అభియోగాలపై గ్యాంబ్లింగ్ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా జూదం, బెట్టింగులు నిర్వహిస్తున్నాడంటూ చెన్నై, కోడంబాక్కం పోలీసులు సోమవారం రాత్రి శ్యామ్ తో పాటు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు.

కిక్ సినిమానే ఇంటిపేరుగా మార్చుకుని కిక్ శ్యామ్ గా ఫేమస్ అయిన ఈ నటుడికి చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో ఓ అపార్టుమెంటులోని ఫ్లాటులో జూదం అడిస్తున్నాడు. గత మూడు నాలుగు నెలలుగా ఓ ఫ్లాటులో పేకాట అడుతున్నారని స్థానికులైన కొందరు పోలీసులకు పిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసి.. అనుమతి లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు గుర్తించి.. నిర్వాహకులతో పాటు ఆడుతన్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. క్లబ్ ముసుగులో గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా, నుంగంబాక్కంలో నివసించే శ్యామ్, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనూ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Shaam  arrest  gambling  kick shaam  Chennai lockdown  chennai police  nungambakkam  chennai  kollywood  tollywood  

Other Articles

Today on Telugu Wishesh