Chiranjeevi corona crisis charity gets few more donations మెగాస్టార్ చిరంజీవి కరోనా చారిటీకి ప్రముఖుల విరాళాలు

Galla padmavati and sai kumar donates amount to chiranjeevi corona crisis charity

chiranjeevi, prabhas, Balakrishna, Nani, sompurnesh babu, sai dharam tej, galla padmavati, sai kumar, adi sai kumar, Uv creation, corona crisis charity, Telugu film industry, industry daily labour, CCC Fund, movies, entertainment, tollywood

In the wake of coronavirus and lockdown Tollywood Celebrities contribute donations to the poor and daily laobur belonging to Telugu Film industry through Megastar Chiranjeevi corona crisis charity (CCC), which had recieving donations from all feilds of the Industry.

మెగాస్టార్ చిరంజీవి కరోనా చారిటీకి ప్రముఖుల విరాళాలు

Posted: 04/09/2020 05:29 PM IST
Galla padmavati and sai kumar donates amount to chiranjeevi corona crisis charity

కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభన నేపథ్యంలో లింక్ తెంచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో.. సినీపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న దినసరి వేతన కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన కరోనా క్రైసెస్ ఛారిటీకి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో పాటు నిర్మాతలు, దర్శకులు, రచయితల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అనేక మంది ప్రముఖులు.. తమ రంగంలోని కార్మికులను అదుకునేందుకు విరాళాలను అందజేస్తున్నారు.  

ఈ క్రమంలో లాక్ డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను, సినీరంగంలోని దినసరి కార్మికులను, పేదలను ఆదుకోవడానికి చిరంజీవి నేతృత్వంలో ఏర్పడిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మార్చి నెల 31వ తేదీకే సుమారు 6.2 కోట్ల రూపాయల విరాళాలను ఈ ఛారిటీ సమకూర్చుకుంది. ఈ విషయాన్ని అప్పట్లో చిరంజీవి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ.. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి సాయం చేయాలని కోరారు.

ఆ తరువాత నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా చిరంజీవి సిసిసి ఛారిటీకి విరాళం ఇచ్చారు. పేద సినీరంగ కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేయడంతో పాటు క్లిష్ట సమయంలో మేమున్నామన్న ధైర్యాన్ని ఇచ్చేందుకు బాలయ్య 25 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఇక తాజాగా రోజు వారీ సినీ కార్మికులను ఆదుకునే నిమిత్తం అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రొడ్యూసర్ పద్మావతి గల్లా ముందుకొచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి విరాళంగా రూ.10 లక్షలు అందజేశారు.

అదే విధంగా, ప్రముఖ సినీ నటుడు సాయికుమార్, హీరో ఆది సాయికుమార్ లు కూడా సీసీసీకి రూ. 5,00,004 విరాళంగా సమర్పించారు. దీంతో చిరంజీవి కరోనా క్రైసెస్ ఛారిటీకి అన్ని విభాగాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్ కు కూడా సాయికుమార్ రూ. 1,00,008 విరాళంగా ఇచ్చారు. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, సాయి కుమార్ సోదరుడు రవి శంకర్ కూడా ఒక లక్ష రూపాయల విరాళాన్ని డబ్బింగ్ యూనియన్ కు విరాళంగా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles