అర్జున్ రెడ్డి సినిమా తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే. అర్జున్ రెడ్డి లో పెద్దగా డైలాగ్స్ లేకపోయినా తన ముఖం లోని అన్ని హావభావాలను పండించి తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టింది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. తమిళంలో విజయ్ ఆంటోనీ సరసన నటించేందుకు ఓ సినిమాను సంతకం చేసింది షాలిని పాండే . కొన్ని వారాల పాటు సజావుగా సెట్స్ కు వెళ్ళి షూటింగ్ లో పాల్గొన్న ఈ అమ్మడు ఆ తర్వాత షూటింగ్ ఎగవేతకు పాల్పడుతుందంటూ శాలిని పాండే పై చిత్ర బృందం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే చిత్ర నిర్మాత శివ శాలిని పాండే పై పోలీసులకు ఫిర్యాదు చేశారట... దీంతో షాలిని పాండే పై క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం. అయితే షాలిని పాండే పై అంతకుముందే తెలుగు తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అప్పటికే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్న ఈ అమ్మడు వచ్చిన సినిమా అవకాశాల విషయంలో కూడా ఇలా ఎందుకు చేసింది అనుకుంటున్న తరుణంలో ఓ కారణం తెరమీదికి వచ్చింది.
శాలిని పాండే ఇటీవలే బాలీవుడ్లో ఒక అదిరిపోయే ఆఫర్ దక్కించుకుందని తెలుస్తోంది. బాలీవుడ్ నేటితరం స్టార్ హీరో రణవీర్ సింగ్ పక్కన జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు చిత్రబంధం శాలిని పాండే ను ఎంపిక చేసిందట. అయితే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం కోసమే దక్షిణాది సినిమాలను శాలిని పాండే పక్కన పెడుతున్నారని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చాయి. తాజా ఘటనతో శాలిని పాండే నిజంగానే దక్షిణాది సినిమాలను పక్కన పెడుతుందని వస్తున్న వార్తలకు బలం చేకూరింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more