అలా.. అలవైకుంఠపురములో మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారో లేదో ఇలా సంక్రాంతి బరిలో కాస్కో అంటూ వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు. మహేష్ బాబు, అనీల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2020 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి హ్యాట్రిక్ విజయాల తర్వాత సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.
మహేశ్ కెరీర్లో 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్, F2 లాంటి వరుస బ్లాక్ బస్టర్ అందుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక మందనా, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రతి సంక్రాంతి మాదిరిగానే వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వార్ మంచి రంజుగా మారింది. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘అల వైకుంఠపురంలో’, మహేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జనవరి 12 ఈ ఇద్దరూ హీరోలో ఢీ బాక్సాఫీస్ బరిలో కొట్టబోతున్నారు. వీరితో పాటు కళ్యాణ్ రామ్ కూడా ‘ఎంత మంచి వాడవురా’ అంటూ తన పందెం పుంజును రెడీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more