Sye Raa gets final nod from High Court ‘సైరా’ విడుదలకు హైకోర్టు పచ్చజెండా..!

High court gives final nod for sye raa release

Sye Raa Narasimha Reddy, Sye Raa Trailer 2, Chiranjeevi, nayantara, amitabh bachchan, surender reddy, Chiranjeevi, Chiru, Sye Raa theatrical rights prices, Ram charan, Sye Raa satellite rights prices, Sye Raa digital rights prices, Sye Raa audio rights prices, Sye Raa area wise rights, Sye Raa distribution rights prices, Tollywood, Entertainment, Movies

Tollywood Megastar Chiranjeevi’s upcoming historical-drama Sye Raa Narasimha Reddy gets final nod for release from Telangana High Court.

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ విడుదలకు హైకోర్టు పచ్చజెండా..!

Posted: 09/27/2019 06:32 PM IST
High court gives final nod for sye raa release

మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటిస్తున్న చారిత్రాక చిత్రం ‘సైరా’ సినిమా విడుదలలో ఏర్పడిన అవాంతరాలు అన్ని తొలగిపోయాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా చేసుకుని గాంధీ జయంతి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమైన ఈ చిత్రానికి అటు న్యాయస్థానం కూడా పచ్చజెండా ఊపింది. ఈ సినిమా కథపై ఉయ్యాలవాడ వంశస్థులు హైకోర్టులో వేసిన కేసును విచారించిన న్యాయస్థానం కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్ కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో చిత్ర విడుదలకు ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిపోయింది.

ఆ సినిమా కథపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు వేసిన కేసును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేస్తూనే.. చిత్ర విడుదలను ఆపాలని వేసిన పిటిషన్‌ను మాత్రం తోసిపుచ్చింది. చిత్ర కథకు డబ్బులు వ్యవహారం ముడిపడివున్న కారణంగా ఈ వ్యవహారాన్ని  సివిల్ కోర్టులో తేల్చుకోవాలని, దానివల్ల సినిమా ఆపడం కుదరదు అని తేల్చి చెప్పింది. చిత్ర కథలో నరసింహారెడ్డి వంశస్థులకు అభ్యంతరాలు వున్నా, లేక తప్పులు వున్నా.. వాటిని చిత్రం విడుదలైన తరువాత కూడా మార్చాలని పిటిషన్ వేసుకోవచ్చని, అంతేకాని ముందు ఆ సినిమా చూపించాల్సిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది.

ఇప్పటివరకు సైరా సినిమా విడుదలకు చివరి నిమిషంలో ఏదైనా అడ్డంకి కలుగుతుందా అని భయపడిన మెగాఫ్యాన్స్ ఇప్పుడు ఊరట చెందుతున్నారు. సైరా అనుకున్న టైమ్‌కే థియేటర్స్‌లోకి వస్తుంది. ఇప్పటికే బాలీవుడ్‌‌లో ఈ సినిమాని ఒక రేంజ్‌లో ప్రొమోట్ చేస్తున్నారు చిరంజీవి. అమితాబ్ కూడా సైరా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడంతో ఇప్పటికే బాలీవుడ్ లో సైరా పై ఉన్న అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అక్టోబర్ 2న థియేటర్స్‌లో సైరా విశ్వరూపం చూడడానికి పక్కాగా ఫిక్స్ అయిపోవచ్చు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sye Raa Trailer 2  Chiranjeevi  nayantara  amitabh bachchan  surender reddy  Ram Charan  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh