saaho grosses Rs 330 crore in 4 days నాలుగురోజుల్లోనే రూ.330 కోట్ల రాబట్టిన ప్రభాస్ ‘సాహో’

Prabhas shraddha starrer grosses rs 330 crore in 4 days

Box Office,Saaho box office collection,Saaho four day collection, Saaho opening week response, Saaho Rs 330 crore gross mark, Saaho total worldwide collection, All time biggest opener Indian films, Prabhas, Shraddha Kapoor, Baahubali 2, Saaho areas wise earnings, Saaho day 1 distributors share, Bollywood, Tollywood, movies, entertainment

Prabhas and Shraddha Kapoor's Saaho has collected over Rs 330 crore gross mark at the worldwide box office up to the fourth day and become the second biggest opener of all time after Baahubali 2.

ప్రభాస్ ‘సాహో’ వసూళ్లు: నాలుగు రోజుల్లో రూ. 330 కోట్లు..

Posted: 09/03/2019 08:17 PM IST
Prabhas shraddha starrer grosses rs 330 crore in 4 days

రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన స్టామినాను చూపించారు. పాన్ ఇండియా స్థాయిలో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నారు. సినిమా టాక్, క్రిటిక్స్ రేటింగ్‌తో సంబంధం లేకుండా తన సినిమా బాక్సాఫీసును షేక్ చేయగలదని ప్రూవ్ చేస్తున్నారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘సాహో’.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు నెగిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్‌తో పాటు రెబల్ స్టార్ అభిమానులు భయపడ్డారు.

కానీ, ఆ భయాన్ని చీల్చుకుంటూ ‘సాహో’ దూసుకెళ్లింది. ‘సాహో’కి ఉన్న క్రేజ్‌తో తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే, రెండో రోజు అంటే శనివారం కలెక్షన్స్ కాస్త తగ్గాయి. ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్ల గ్రాస్ మాత్రమే ‘సాహో’ వసూలు చేసింది. అయితే, ఇదేమీ తక్కువేమీ కాదు. కాకపోతే, తొలిరోజుతో పోలిస్తే తక్కువగా కనిపిస్తుంది అంతే. శనివారంతో పోలిస్తే ఆదివారం కలెక్షన్లు పుంజుకున్నాయి. ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ వసూలైంది.

నాలుగో రోజు సోమవారం వినాయక చవితి కావడంతో కలెక్షన్లు బాగా పెరుగుతాయని అంతా ఆశించారు. కానీ, ‘సాహో’ అనుకున్న స్థాయిలో వసూలు చేయలేదు. సోమవారం కేవలం రూ. 36 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలైంది. మొత్తం మీద నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 330 కోట్లకు పైగా గ్రాస్‌ను ‘సాహో’ రాబట్టింది. ఈ మొత్తంలో సుమారు రూ.165 కోట్లు డిస్ట్రిబ్యూటర్ల షేర్ అని అంటున్నారు. కాగా బాలీవుడ్ లో మాత్రం సాహోకు వినాయక చవితి కలసిరాలేదు. అంతకుముందు మూడు రోజుల్లో వసూలు చేసిన మొత్తాని పరిగణలోకి తీసుకుంటే.. వినాయక చవితి రోజున అత్యంత కనిష్ట స్థాయికి వసూళ్లు పడిపోయాయి.

వాస్తవానికి నాలుగు రోజుల్లో రూ.330 కోట్ల గ్రాస్ అంటే తక్కువేమీ కాదు. ఇది కేవలం గ్రాస్ కాబట్టి ఇంకా సాహో చాలా వసూళ్లను రాబట్టాల్సివుంది. లాభాల విషయాన్ని పక్కనబెడితే.. కనీసం షేర్ అయినా రాబట్టాల్సిందే. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ.277 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ప్రస్తుతానికి రూ. 165 కోట్లు వచ్చింది. అంటే, డిస్ట్రిబ్యూటర్లకు ఇంకా 40 శాతం వరకు రికవరీ కావాల్సి ఉంది. అయితే రెండో వారాంతానికి వసూళ్లు రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు ఊరటనిస్తోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి, ఫుల్ రన్‌లో ‘సాహో’ ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ 4 రోజుల షేర్ వివరాలు..
నైజాం - రూ. 23.30 కోట్లు
సీడెడ్ - రూ. 9.60 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ. 8 కోట్లు
గుంటూరు - రూ. 7.10 కోట్లు
తూర్పు గోదావరి - రూ. 6.40 కోట్లు
పశ్చిమ గోదావరి - రూ. 4.86 కోట్లు
కృష్ణా - రూ. 4.50 కోట్లు
నెల్లూరు - రూ. 3.59 కోట్లు
మొత్తం షేర్ - రూ. 67.35 కోట్లు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles