Kalyan Ram set to be in pongal big fight సంక్రాంతి బిగ్ ఫైట్ లో నందమూరి కల్యాణ్ రామ్.!

Kalyan ram s entha manchivadavuraa set to be released on sankranti

kalyan ram in sankranthi fight, kalyan ram entha manchivadavu ra, nandamuri kalyan ram, entha manchivadavu ra, sankranthi fight, Allu Arjun, Mahesh Babu, pongal 2020, tollywood, movies, Entertainment

Nandamuri KalyanRam is set to fight pongal big fight with Stylish star Allu Arjun, Super star Mahesh babu and two others, with his Entha Manchivadavuraa.

సంక్రాంతి బిగ్ ఫైట్ లో నందమూరి కల్యాణ్ రామ్.!

Posted: 08/19/2019 07:24 PM IST
Kalyan ram s entha manchivadavuraa set to be released on sankranti

విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకుసాగుతున్నాడు. అయితే ఇలా రోటీన్ గా వుంటే గుర్తింపు ఏముంటుందని భావించాడో ఏమో తెలియదు కానీ.. ఈ సారి సంక్రాంతికి తాను బరిలో నిలుస్తానని అంటున్నాడు. సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద స్టార్ హీరోల ఫైట్ ఇప్పటికే హాట్ టాపిక్ గా సాగుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న నందమూరి హీరో కళ్యాణ్ ప్రస్తుతం ఎంత మంచి వాడవురా! అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.

శతమానం భవతి సినిమాతో 2017 సంక్రాంతికి మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఆ తరువాత నితిన్ తో చేసిన శ్రీనివాస కళ్యాణ్ బెడిసికొట్టింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాతో సంక్రాంతి సెంటిమెంట్ గా మళ్ళీ తన లక్కును పరీక్షించుకోబోతున్నాడు. అయితే పొంగల్ బరిలో ముందుగానే స్టార్ హీరోలు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అప్పుడే రాబోతోంది. అలాగే మహేష్ - అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సంక్రాంతికే రానుంది.

వీటితో పాటు మరో రెండు పెద్ద సినిమాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సూపర్ స్టార్ స్టైలిష్ స్టార్ అయితే సంక్రాంతికి రావాల్సిందే అని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో కల్యాణ్ రామ్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. టైటిల్ ను బట్టే ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రమని తెలుస్తోంది. కథాకథనాల పరంగా చూసుకుంటే ఇది తన కెరియర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో కల్యాణ్ రామ్ వున్నాడు. మరి ఈ బిగ్ ఫైట్ లో ఏ హీరో క్లిక్కవుతాడో చూడాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Kartikeya in 90ml trailer plays a man who has to drink alcohol to survice

  రాజావారి యోగం.. కార్తికేయ ‘90 ఎంఎల్’ టీజర్

  Nov 21 | ‘కొందరికి మందు తాగడం సరదా. మరికొందరికి వ్యసనం. కానీ, ఈ పార్వతీపురం దేవదాసుకి మాత్రం అది అవసరం’ అని అంటున్నారు నటుడు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్‌’. నేహా సోలంకి కథానాయిక.... Read more

 • Ruler teaser powerful balakrishna dons multiple avatars in this intense action drama

  అంచనాలు పెంచుతున్న బాలయ్య ‘రూలర్’ టీజర్.!

  Nov 21 | నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రూలర్’ టీజర్ రానే వచ్చింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ చిత్రంలో మాస్ డైలాగులు జోడించారు. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునేట్టుగా ఫైట్స్... Read more

 • Bhagyanagara veedullo gammathu trailer hilarious parodies galore

  ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ ట్రైలర్.. కామెడీ అదుర్స్

  Nov 20 | కామెడీయన్ నటుడిగా తనకంటూ ఓ ప్రాముఖ్యతను, ప్రత్యేకతను సంపాదించుకుంటున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి.. తన స్వియ నిర్మాణ, దర్శకత్వంలో రూపోందించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. తొలిసారిగా ఆయన మెగాఫోన్... Read more

 • Ram charan looking for newbie trisha out from chiru 152 movie

  చిరంజీవి 152లో హీరోయిన్ కోసం వేట.. త్రిష ఔట్.?

  Nov 20 | మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తరువాత తెరకెక్కుతున్న మూడవ చిత్రంలో నటించేందుకు చిత్ర నిర్మాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కొత్త ముఖం కోసం అన్వేషిస్తున్నారు. సామాజిక సృహ వున్న దర్శకుడు.. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్... Read more

 • Mismatch trailer generated curiosity towards the film

  ‘మిస్ మ్యాచ్’లో బాక్సర్ గా మెప్పిస్తున్న ఐశ్వర్య రాజేశ్

  Nov 20 | ‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్‌ ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఈజ్‌ ద రియల్‌ మ్యాచ్‌ అనేది ఉప శీర్షిక. ఎన్‌వి. నిర్మల్‌ కుమార్‌... Read more

Today on Telugu Wishesh