టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన బాహుబలి చిత్రాల తరువాత కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో నటిస్తున్న 'సాహో' చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారెడు అంచనాలు వున్నాయి. బాహుబలితో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్.. చిత్రంపై ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాది సహా యావత్ భారతం ఎదురుచూస్తోంది. ఈ సినిమా నుంచి ఒక సర్ ప్రైజ్ ఉంటుందని వీడియో బైట్ ద్వారా నిన్నచెప్పిన ప్రభాస్.. ఇవాళ అన్నట్టుగానే కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను విడుదల చేశారు.
డిఫరెంట్ లుక్ తో .. చాలా తీక్షణమైన చూపులతో ప్రభాస్ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. తుఫాను ముందు ప్రశాంతంగా కనిపించే సముద్రుడిలా ప్రభాస్ తన ఫోటోతో అభిమానులను అకట్టుకుంటున్నాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ఈ పోస్టర్ ద్వారా తెలియజేశారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రద్ధా కపూర్ కనిపించనుంది.
ఎంతోమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ నటి శ్రద్దాకపూర్ నటిస్తుండగా, నీల్ నితన్ ముఖేష్, ఎల్వియన్ శర్మ, మందిరా బేడి, జాకీ ష్రాఫ్ తదితర బాలీవుడ్ తారలు నటిస్తున్నారు. ఈ సినిమా కోసమే ప్రభాస్ అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ కూడా అంతేవేంగా అన్ లైన్ లో సందడి చేస్తున్నాయి.
View this post on InstagramIf you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)
Other Articles
![]()
ఆకట్టుకుంటున్న 'ఇదే మా కథ' టీజర్
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
![]()
సాయి తేజ్ ‘రిపబ్లిక్’ నుంచి తొలి టీజర్..
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
![]()
’ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేగ్ కన్ఫామ్.. ముహుర్తం ఫిక్స్ చేసిన జక్కన్న
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
![]()
రవితేజ చిత్ర విడుదలకు ‘క్రాక్’ ఎత్తించిన ఫైనాన్షియర్
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
![]()
చరిత్రలో సుఖపడని వారు ఎవరో వివరంగా చెప్పిన సాయ్ ధరమ్ తేజ్
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more