Naga Shaurya turns scriptwriter with his next నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం..

Naga shaurya film launched with raghavendra rao clap

Naga Shaurya, writer, Sargun Kaur, Mehreen Pirzada, Ramana Teja, Raghavendra Rao,, tollywood, movies, entertainment

Naga Shaurya, new film was launched today with veteran directors K Raghavendra Rao snapping the clapboard and Parasuram helming the first shot. This Hero will be turning scriptwriter with his next film.

రాఘవేంద్ర రావు క్లాప్ తో.. నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం..

Posted: 05/11/2019 09:08 PM IST
Naga shaurya film launched with raghavendra rao clap

యువ కథానాయకులలో నాగశౌర్యకి మంచి క్రేజ్ వుంది. అయినా ఆయన కూడా గత కొంతకాలంగా సక్సెస్ కోసం వేచి చూస్తున్నాడు. వరుసగా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఆయన సొంత బ్యానర్లో 'నర్తనశాల' చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా పరాజయాన్ని చవిచూడటంతో నాగశౌర్య, కొంత గ్యాప్ తీసుకొక తప్పలేదు. అయితే ఏమాత్రం వెనకడుగు వేసేదిలేదని నిర్ణయించుకున్న ఈ హీరో తన బ్యానర్లోనే మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు.

కొంత గ్యాప్ తీసుకున్న నాగశౌర్య ఈ సమయంలో ఏం చేశాడంటే.. ఏకంగా కథా రచయితగా మారాడు. తన సొంత బ్యానర్లో నిర్మించనున్న ఈ చిత్రానికి ఆయనే కథను సమకూర్చుకున్నాడని సమాచారం. తన కథను సినిమాగా రూపొందించే బాధ్యతను కూడా కొత్త దర్శకుడిపైనే పెట్టాడు నాగశౌర్య. దీంతో ఈ చిత్రంలో రమణ తేజ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకున్నారు.

హైదరాబాద్ - మాదాపూర్ లోని వీఎస్ ఎస్ స్క్వేర్ లో ఈ సినిమాను లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా .. దర్శకుడు పరశురామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ నెల 13 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంలోని అధికబాధాన్ని విశాఖపట్నంలో షూట్ చేయనున్నట్లు చెప్పారు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను, ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Shaurya  writer  Sargun Kaur  Mehreen Pirzada  Ramana Teja  Raghavendra Rao  tollywood  

Other Articles