Dear Comrade movie Release date Confirmed విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న ‘డియర్ కామ్రేడ్’

Vijay devarakonda dear comrade movie release date confirmed

vijay devarakonda,vijay devarakonda dear comrade,dear comrade movie,dear comrade movie release date,dear comrade july 26th release,vijay devarakonda dear comrade movie teaser,vijay devarakonda twitter,dear comrade movie pre release business,vijay devarakonda rashmika mandanna kiss,vijay devarakonda dear comrade,dear comrade release date, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

Vijay Deverakonda and Rashmika Mandanna's much-waited Dear Comrade is set to hit cinemas on 26 July. The film's previous release date was 31 May, but it clashed with Tamil actor Suriya’s NGK,

విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న ‘డియర్ కామ్రేడ్’

Posted: 05/08/2019 10:24 PM IST
Vijay devarakonda dear comrade movie release date confirmed

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. ఏడాది కింద గీత గోవిందం ఏకంగా 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసి విజ‌య్ స్టామినా ఏంటో చూపించింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన టాక్సీవాలా కూడా 24 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకుంది. దాంతో ఇప్పుడు డియ‌ర్ కామ్రేడ్ సినిమా బిజినెస్ కు రెక్క‌లొచ్చేస్తున్నాయి. దీంతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ మార్కెట్ ఎంత వరకు వుంటుందన్న అసక్తి నెలకోంది. ఈ సినిమా విడుద‌ల తేదీనే ఇంకా క‌న్ఫ‌ర్మ్ చేసుకోలేదు.. అప్పుడే ప్రీ రిలీజ్ బిజినెస్ అంటారేంటీ అంటున్నారా..?

తాజాగా డియర్ కామ్రేడ్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అన్ని భాష‌ల్లోనూ జులై 26నే విడుద‌ల కానుంది డియ‌ర్ కామ్రేడ్. తాజాగా ఈ చిత్ర విడుద‌ల తేదీ క‌న్ఫ‌ర్మ్ చేస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రంతో క‌చ్చితంగా మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ కొడ‌తానంటూ ధీమాగా చెబుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా ఈ మ‌ధ్యే విడుద‌లైన టీజ‌ర్ అద్భుత‌మైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇక ఇప్పుడు సినిమా విడుద‌ల తేదీ కూడా క‌న్ఫ‌ర్మ్ కావ‌డంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జ‌రుగుతుంది. తెలుగులో ఈ సినిమాను 30 కోట్ల వ‌ర‌కు అమ్మేస్తున్నారు. నైజాంలో ఏకంగా 7.5 కోట్లకు ఈ సినిమా హ‌క్కులు అమ్మేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. విజ‌య్ సినిమాలు నైజాంలో అద్భుతాలు చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఈయ‌న‌కు ఉన్న క్రేజ్ ముందు 7.5 కోట్లు త‌క్కువే. ఇక సీడెడ్ 3.5 కోట్లు.. ఆంధ్రా ఏరియాలో 10 కోట్లకు సినిమాను అమ్మేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఓవ‌ర్సీస్ కూడా భారీగానే అమ్ముడైపోతుంది.

తెలుగుతో పాటు మిగిలిన భాష‌లు క‌లిపి 40 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నాడు డియర్ కామ్రేడ్. అంటే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే క‌నీసం 50 కోట్లు తీసుకురావాలి. మొత్తానికి ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్‌కు డియర్ కామ్రేడ్ పెద్ద పరీక్షే పెడుతుందన్నమాట. మే 31న ఈ సినిమా విడుద‌ల కానుంది. ర‌ష్మిక మంద‌న్న ఈ చిత్రంలో హీరోయిన్. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ తెర‌కెక్కిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay devarakonda  dear comrade  release date  pre release business  tollywood  

Other Articles