Mahanati' picked for Shanghai film fest ‘మహానటి’కి అరుదైన ఘనత.. షాంఘైకి చేరిన సావిత్రి బయోపిక్

Nag ashwin s savitri biopic mahanati heads to shanghai international film festival

Shanghai International Film Festival, savitri biopic, Mahanati, keerthy suresh, Samantha, Vijay Deverakonda, Nag Ashwin, shanghai, mahanati savitri biopic, Samantha mahanati, Nag Ashwin mahanati, keerthy suresh mahanati, Film Festival mahanati, dulquer salmaan, tollywood, movies, entertainment

‘Mahanati’ has been selected in the ‘International Panorama’ category and is reportedly the only Indian film to have the honour of being selected by the 22 nd edition of the Shanghai International Film Festival jury this year, which is slated to be held from June 15-24.

నాగ్ అశ్విన్ ‘మహానటి’కి అరుదైన ఘనత.. షాంఘైకి చేరిన సావిత్రి బయోపిక్

Posted: 05/04/2019 08:39 PM IST
Nag ashwin s savitri biopic mahanati heads to shanghai international film festival

నాగ్ అశ్విన్ దర్శకుడిగా రెండేళ్ల పాటు కష్టపడి పాతకాలం నాటి దిగ్గజ నటి సావిత్రి జీవిత కథ పై రీసర్చ్ చేసి అమె జీవితాన్ని తెరపై రూపొందించిన ‘మహానటి’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఈ చిత్రం తెలుగురాష్ట్రాలలో విడుదలై బాక్సాఫీసు వద్ద రికార్డులను కొల్లగొట్టడంతో పాటు అలనాటి నటి తెరవెనుక జీవితాన్ని కూడా అవిష్కరించడంలో దర్శకుడు నాగ్ అశ్విన్ మంచి మార్కులే సాధించాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ఇప్పటికీ గూడకట్టుకున్న మహానటులపై అభిమానాన్ని ఆయన తట్టిలేపాడు.

ఇప్పటికే ఈ చిత్రం భారతీయ అంతర్జాతయ ఫిల్మ్ పెస్టివల్ తో పాటు మెల్ బొర్న్ ఫిల్మ్ పెస్టివల్ లో కూడా ప్రదర్శింపబడి ప్రేక్షకులు మనన్నలను అందుకుంది. కాగా తాజాగా ఈ చిత్రం మరో ఘనతను కూడా అందుకుంది. జూన్ 15 నుంచి 24 వరకు నిర్వహించనున్న 22వ షాంఘై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఎస్ఐఎఫ్ఎఫ్)కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా ఇది రికార్డులకెక్కింది. ‘ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌' విభాగంలో ఈ సినిమాను ఎంపిక చేశారు.

ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా మెయిన్‌ల్యాండ్ చైనాలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. వైజ‌యంతీ మూవీస్‌- స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటి కీర్తి సురేశ్  టైటిల్ పాత్ర‌లో నటించగా, దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా ద‌క్షిణాది స్టార్స్ అంద‌రూ ఈ చిత్రంలో న‌టించారు.  గతేడాది మే 9న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ ఆదరణ లభించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles