Wishing Mega Producer Allu Aravind A Happy Birthday 70వ పడిలో మెగా నిర్మాత అల్లు అరవింద్

Wishing mega producer allu aravind a happy birthday

Allu Aravind, Allu Aravind birthday, Allu Aravind birthday article, Allu Aravind latest, Allu Aravind news, Allu Aravind movies, Allu Aravind business, Wishing Mega Producer Allu Aravind A Happy Birthday, tollywood, bollywood, kollywood, Andhra pradesh, telangana, telugu states

Wishing Mega Producer Allu Aravind A Happy Birthday: Allu Aravind is celebrating his 70th birthday and wishing all the best.

మెగా నిర్మాత అల్లు అరవింద్ కు జన్మదిన శుభాకాంక్షలు

Posted: 01/10/2019 09:17 PM IST
Wishing mega producer allu aravind a happy birthday

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇండియన్ సినిమాలో ఒక బాగమే అయినా.. ఇండియన్ సినిమాలో కూడా తన ప్రభావాన్ని చాటుకుంది. ఇందుకో తెలుగు చిత్రసీమలోని నిర్మాతలు కృషి, పట్టుదల ఎంతో వుంది. లాభాపేక్షతో పాటు క్వాలిటీతో పోటీపడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్ లకు అనుగూణంగా సినిమాలు తీస్తూ.. భారతీయ సినీ ఇండస్ట్రీలో తామెవరికీ తక్కువ కావు అంటూ పోటీపడటంతోనే ఇది సాధ్యమైంది. ఇలా మారుతున్న కాలానికి అనుగూణంగా పోటీతత్వంతో సినిమాలను తీసిన ఎందరో అగ్ర నిర్మాతలు టాలీవుడ్ సొంతం.

వారిలో మెగా ప్రోడ్యూసర్ గా మాత్రం కీలక భూమిక పోషించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది మాత్రం మెగా నిర్మాత అల్లు అరవింద్. లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు అరవింద్..గురువారం 70వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. నిర్మాతగా తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్ మొదట్లో నటుడిగా కొన్ని సినిమాలు చేసిన అల్లు అరవింద్.. ఆ తర్వాత గీతా ఆర్ట్స్ స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా చిరంజీవి హీరోగా నిర్మించిన విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రౌడీ అల్లుడు ఇలాంటి ఎన్నో చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి.

చిరంజీవి తరం తర్వాత వచ్చిన వారసులతోనూ సినిమాలు నిర్మించారు. తనయుడు అల్లు అర్జున్ ను గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయం చేశారు ఈయ‌న. రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సినిమాతో తెలుగు ఇండస్ట్రీ స్టామినా పెంచారు ఈ నిర్మాత. ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తొలిసారి 40 కోట్ల బడ్జెట్ పెట్టి 70 కోట్లకు పైగా వసూలు చేసిన ఘనత అల్లు అరవింద్ కి దక్కింది. హిందీలో అమీర్ ఖాన్ లాంటి హీరోతో గజిని సినిమా నిర్మించి 100 కోట్ల మార్క్ కు శ్రీకారం చుట్టారు ఈ మెగా ప్రొడ్యూసర్.

ఇక తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌చ్చిన జ‌ల్సా సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి 1000 థియేట‌ర్ల ట్రెండ్ ప‌రిచ‌యం చేసారు. కేవలం మెగా హీరోలతోనే కాకుండా నాని, శర్వానంద్ ఇలాంటి హీరోలతో కూడా సంచలన సినిమాలు నిర్మించారు అల్లు అరవింద్. ఇప్పటికీ వరస సినిమాలు నిర్మిస్తూ గీతా ఆర్ట్స్ ను తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక సంస్థగా నిలబెట్టారు అల్లు అరవింద్. 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈయ‌న‌ ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Aravind  mega producer  geeta arts  tollywood  Andhra pradesh  telangana  

Other Articles