జబర్ధస్త్ షో యాంకరింగ్ చేసి అతితక్కువకాలంలో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించిన అనసూయ భరద్వాజ్ కు దాంతోనే ఇటు తెలుగు చలనచిత్రరంగంలోకి ఎంట్రీ ఇచ్చి బహుచక్కని పాత్రలు పోషిస్తుంది. గత ఏడాది 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ పాత్ర ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేసింది. అంతకుముందు ఆమె తీసిన క్షణం చిత్రం కూడా అమెకు మంచిపేరును తీసుకువచ్చింది.
అలాంటి అనసూయ న్యూఇయర్ సందర్బంగా తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ సందర్భంగా అమె రోజుకు కనీసం 20 నుంచి 25 మంది తన ఫాలోవర్లను బ్లాక్ చేస్తూవుంటానని కూడా చెప్పేసింది. అదేంటి అంటే అసంబధ్ద ప్రశ్నలు అడిగి విసిగించేవారిని ఎవరు మాత్రం భరిస్తారు అందుకనే అమె తన ఫాలోవర్లను ఫసక్ చేస్తుంది. ఫాలోవర్ల సంఖ్యను పెంచుకునే సెలబ్రిటీలు.. విసిగించేవారిని వదిలించుకోకపోతే అదో టెన్షన్. అసలే బిజీ షెడ్యూలతో యాంత్రంలా పనిచేసే వారికి ఈ నస ఎందుకు.
అయితే అమె చాటింగ్ సమయంలో అమెకు చిత్రమైన ప్రశ్నలు వచ్చిపడ్డాయి.. "మీరు టీవీ ఛానల్ ను .. సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా విన్నాము .. వాటిని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు?" అనే ప్రశ్న ఒక అభిమాని నుంచి అనసూయకి ఎదురైంది. అందుకు అనసూయ స్పందిస్తూ .."ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందండీ బాబూ" అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. విక్టరీ వెంకటేష్ తో నటించాలన్న తన ఆశ తీరిందని అమె చెప్పుకోచ్చింది.
ఇక ఇతర అభిమానుల ప్రశ్నలకి సమాధానంగా .. 'నా కెరియర్లో 'రంగమ్మత్త' పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో నా పాత్రకి వచ్చిన ప్రశంసలు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి. నటనకు .. గ్లామర్ కి ప్రాధాన్యత గల పాత్రలనే అంగీకరిస్తానని చెప్పింది. అంతటితో అగని అభిమానులు అమె వంటిపైనున్న టాటూ గురించి కూడా అడగ్గా, నిక్కు అన్నది తన టాటూ అని అది తన భర్త ముద్దుపేరని చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more