PPLM song: Sharwa's poetic love! వినసొంపుగా హృదయం జరిపే సాంగ్

Hrudhayam jaripe sai pallavi s next song is here

Padi Padi Leche Manasu, Hrudhayam Jaripe, Hrudhayam Jaripe Lyrical, Sharwanand, Sai Pallavi, Vishal Chandrashekar, Hanu Raghavapudi, Sudhakar Cherukuri, latest movie news, kollywood, movies, entertainment

Padi Padi Leche Manasu is a Telugu-language romantic film directed by Hanu Raghavapudi starring Sharwanand and Sai Pallavi in the lead. The film is scheduled to release on 21 December 2018.

మనసును కట్టేస్తున్న హృదయం జరిపే సాంగ్

Posted: 12/06/2018 08:03 PM IST
Hrudhayam jaripe sai pallavi s next song is here

తన తొలి సినిమాతోనే తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న నటి సాయిపల్లవి.. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. విభిన్నమైన కథంశాలను ఎంచుకుని తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న శర్వానంద్ ఈ చిత్రంలో హీరో. శర్వానంద్ కు జంటగా రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమైన 'పడి పడి లేచె మనసు' సినిమాలో నటిస్తున్న సాయిపల్లవి చిత్రంలో కాలేజ్ స్టూడంటుగా కనిపించనుందని టాక్. ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

"నువు నడిచే ఈ నేలపైనే .. నడిచానా ఇన్నాళ్లుగానే .. ఈ క్షణమే ఆపాలనున్నది భూభ్రమణమే. ఈ చెలిమి వద్దంటూ గతమే .. బందీగా చేసింది నన్నే .. తక్షణమే చేయాలనున్నది తనతో యుద్ధమే" అంటూ ఈ పాట కొనసాగుతోంది. సంగీత సాహిత్యాలు బాగున్నాయి. శర్వానంద్ .. సాయిపల్లవిపై సాగే ఈ పాట యూత్ కు బాగా కనెక్ట్ అవుతుందని అనిపిస్తోంది. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' హిట్ తరువాత సాయిపల్లవి .. 'మహానుభావుడు' హిట్ తరువాత శర్వానంద్ చేసిన సినిమా ఇది. అందువలన సహజంగానే మంచి అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles