vijay devarakonda busy with dear comrade డియర్ కామ్రేడ్ అంటున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda busy with dear comrade shooting

vijay devarakonda, dear comrade, Taxiwala, dear comrade shooting, publicity stunt, latest movie news, kollywood, movies, entertainment

After his latest outing Taxiwala has gone sounding at tollywood box office, now vijay devarakonda busy with dear comrade shooting.

డియర్ కామ్రేడ్ అంటున్న విజయ్ దేవరకొండ

Posted: 12/01/2018 07:42 PM IST
Vijay devarakonda busy with dear comrade shooting

నోటా మిగిల్చిన గాయం నుంచి తేరుకున్న 'టాక్సీవాలా' విజయ్ దేవరకొండ.. తన తదుపరి చిత్రంతో బిజీగా మారాడు. టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద అనూహ్యమైన విజయం సాధించడంతో యువతలో తన క్రేజ్ ను తిరిగి సంపాదించుకున్న ఈ అర్జున్ రెడ్డి.. తన అభిమానులంతా ఫుల్ ఖుషీ గా వుండటంతో సంతోషంగా వున్నారు. ఈ సక్సెస్ తెచ్చిన ఆనందంతో ఆయన తన తదుపరి చిత్రమైన 'డియర్ కామ్రేడ్' షూటింగులో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు కాకినాడలోని మెడికల్ కాలేజ్ లో జరుగుతోంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. అందువలన కాలేజ్ నేపథ్యంలో సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజులపాటు అక్కడే షూటింగు జరపనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోను విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. భరత్ కమ్మ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తన కెరియర్లో ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకంతో విజయ్ దేవరకొండ వున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijay devarakonda  dear comrade  Taxiwala  dear comrade shooting  tollywood  

Other Articles