nannu dochukunduvate movie pre release tour ముందస్తు ప్రచారానికి ‘‘నన్న దోచుకుందువటే’’ టీమ్

Nannu dochukunduvate movie pre release tour

nannu dochukunduvate, sudheer babu, Nabha Natesh, B.Ajaneesh Loknath, RS Naidu, movies, entertainment, tollywood

nannu dochukunduvate movie staring sudheer babu and Nabha Natesh, has planned to tour vishakapatnam, kakinada, and coastal areas as a part of pre release tour and promote the movie

ముందస్తు ప్రచారానికి ‘‘నన్న దోచుకుందువటే’’ టీమ్

Posted: 08/24/2018 07:30 PM IST
Nannu dochukunduvate movie pre release tour

ముందస్తు ఎన్నికల వాతావరణం యావత్ దేశంలో వేడిని రాజేస్తున్న క్రమంలో ముందస్తు ప్రచారానికి తెరతీస్తుంది సుధీర్ బాబు చిత్రం. తన సొంత బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో రూపొందుతుంది. నాభా నటేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వినాయక చవితి కానుకగా వచ్చేనెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ టూర్ ను ప్లాన్ చేసింది. ఈ నెల 25, 26వ తేదీలలో ఈ టూర్ ను జరపనున్నారు.

 ప్రమోషన్ లో భాగంగా 25వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు 'రాజమండ్రి'లోని ఐ.ఎస్.టి.ఎస్ కాలేజ్ కి ఈ సినిమా టీమ్ చేరుకోనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు 'కాకినాడ'లోని కెఐఈటీ ఉమెన్స్ కాలేజ్ లో అభిమానులను కలవనున్నారు. ఇక 26వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం - అరసవిల్లి ఆలయానికి చేరుకోనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి విశాఖపట్నంలోని సిఎంఆర్ మాల్ లో సందడి చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా రిలీజ్ చేశారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nannu dochukunduvate  sudheer babu  Nabha Natesh  B.Ajaneesh Loknath  RS Naidu  tollywood  

Other Articles