comedian Prudhvi Raj on casting couch నిర్మాత గురించి తెలిసి.. గెస్ట్ హౌజ్ కు ఎందుకెళ్లారు.?

Tollywood comedian prudhvi raj responds on casting couch

comedy artist Prudhvi Raj on casting couch, sri devi, radha, amani, divyavani, laya, Prudhvi Raj, casting couch, producers, actress, charecter artists, top heros, telugu heroines, tollywood, movies, entertainment

After Tollywood charecter artists blamed industry on casting couch, comedian Prudhvi Raj responds on the issue and questions who are the heroines for topheros in the industry.

టాలీవుడ్ అంటే.. అద్దెకు ఇళ్లు కూడా దొరకడం లేదు: పృథ్వీ

Posted: 06/30/2018 06:02 PM IST
Tollywood comedian prudhvi raj responds on casting couch

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని హాస్యనటుడు పృథ్వి తెలిపాడు. కొంత మంది వల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. తన సినిమాలో హీరోయిన్ పాత్రకు సరిపోయే అమ్మాయి కోసమే నిర్మాత వెతుకుతాడని... ఎవరికి పడితే వారికి హీరోయిన్ పాత్రను ఇవ్వలేడని చెప్పారు. 'మల్లీశ్వరి' సినిమాలో హీరోయిన్ పాత్రకు కత్రినా కైఫ్ లాంటి అమ్మాయి అయితేనే సరిపోతుందని... ఇక్కడున్నవాళ్లతో ఆ పాత్రను చేయించలేమని తెలిపారు. తెలుగు వారికి హీరోయిన్ల తప్ప అన్ని క్యారెక్టర్లను చేస్తున్నారన్నారు.

తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం వరకు తెలుగు హీరోయిన్లే ఉన్నారని... ఆమని, దివ్యవాణి, లయ వరకు ఆ ట్రెండ్ నడిచిందని చెప్పారు. అయితే ప్రస్తుతం తరుణంలో టాప్ హీరోల పక్కన సరిపోయే తెలుగు అమ్మాయిలను చూపించండంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. సినీ పరిశ్రమను అనవసరంగా బద్నామ్ చేస్తున్నారన్న ఆయన నిజంగా వీరు చెప్పింది నిజమే అయితే ఈ పరిశ్రమలోకి సినీతారల వారుసులు, వారసురాళ్లు ఎందుకు వస్తారని ఆయన నిలదీశారు.

సినీపరిశ్రమ పరువు పోయేలా కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రవర్తిస్తున్నారని పృథ్వి ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల్లో పని చేసే మహిళలకు అద్దెకు ఇల్లు కూడా దొరకని పరిస్థితి ఉందని అన్నారు. ఓ సినీ నిర్మాత గురించి ఒక ఆవిడ తీవ్ర ఆరోపణలు చేసిందని... మరి ఆయన గురించి తెలిసి కూడా గెస్ట్ హౌస్ కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. వాస్తవానికి నటీమణుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు ఇండస్ట్రీలో లేరని, కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇండస్ట్రీ అంటేనే జనాల్లో చులకన భావం ఏర్పడిందని అన్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prudhvi Raj  casting couch  producers  actress  charecter artists  top heros  telugu heroines  tollywood  

Other Articles

Today on Telugu Wishesh