janhvi electrifying dance in Dhadak శ్రీదేవి కూతరు జాన్వీ.. డాన్స్ అదుర్స్..!

Janhvi electrifying dance performance in dhadak

Dharma, Dharma Productions, dhadak, dhadak danve, janhvi kapoor, janhvi kapoor dance in dhadak, ishaan khatter, ishaan khatter dance in dhadak, janhvi, dhadak photos, dhadak trailer, anhvi Kapoor, jhanvi kapoor, Ishaan Khatter, Ishaan, Sairat, Marathi, Remake, Adaptation, Music, Zingaat, Zinghat, Karan Johar, Karan, Zee Studios, Bollywood, movies, entertainment

Film maker Boney kapoor and Legendary actress Sridevi's daughter Janhvi kapoor, who makes her debut in the Hindi film industry with Dhadak.. has delivered an electrifying dance performance in a song.

శ్రీదేవి కూతరు జాన్వీ.. డాన్స్ అదుర్స్..!

Posted: 06/27/2018 07:50 PM IST
Janhvi electrifying dance performance in dhadak

దివంగత నటి శ్రీదేవి తనయ కూడా అమ్మలా అభినయం చేయడమే కాదు అంతకుమించి డాన్స్ చేయడం కూడా నేర్చేసుకుందని సినీవర్గాలు అంటున్నాయి. జాన్వీ నటించిన ‘దఢక్‌’ చిత్రంతో బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో తన సినీ జీవిత అదృష్టాన్ని పరీక్షించుకోనున్న జాన్వికి కొందరు సూచనలు చేస్తుండగా, అభిమానులు మాత్రం అసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా విడుదలైన పాటలో.. అటు ఇషాన్ ఖట్టర్, ఇటు జాన్వీ కపూర్ లిద్దరూ తొలి సినిమాలో డాన్స్ చేసినట్టుగా కాకుండా ఎంతో అనుభవం వున్న నటీనటులగా చేశారని ప్రశంసలను అందుకుంటున్నారు.

మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న ‘సైరాట్‌’కు ఇది రీమేక్‌గా రాబోతోందని చిత్రబృందం ప్రకటించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్‌లుక్‌తోనే జాన్వి ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. చిత్ర ట్రైలర్‌ను విడుదలైన తరువాత మరింత అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా విడుదల అయిన ‘ధడక్’ సినిమాలో ‘జిగ్ జిగ్ జింగత్..’ సాంగ్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది.

నాన్ స్టాప్‌గా సాగే ఈ పాటకు ఇషాన్, జాన్వీల నాన్‌స్టాప్ డ్యాన్స్ అదిరిపోయింది. కొత్త వాళ్లలో ఉండే ఎనర్జీ ఏమిటో వీళ్లిద్దరూ చూపించారు. ఇదే సమయంలో అనుభవం ఉన్న వాళ్లలా మెప్పించడం వీళ్ల ప్రతిభకు తార్కాణం. ఇక ఫాస్ట్ బీట్‌తో సాగే ఈ సాంగ్ క్యాచీ పదాలతో యూత్‌ను ఆకట్టుకుంటోంది. మాస్ ఆడియన్స్‌లోకి చొచ్చుకుపోతోంది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.  జులై 20న ‘దఢక్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : janhvi kapoor  ishaan khatter  dhadak  dance  Sairat  Marathi  bollywood  

Other Articles