chiru simultaneously shoot for syeraa along with koratala మెగాస్టార్ నెక్ట్స్ మూవీలో ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Megastar chiranjeevi goes on sets with koratala simultaneously with syeraa

Megastar Chiranjeevi, chiru, Sye Raa, syeraa updates, freedom fighter, biopic, Uyyalawada Narasimhareddy, Koratala Siva, surender reddy, dual role, movies, entertainment, tollywood

Even as he continues to shoot for Sye Raa, the keenly awaited biopic on the first Telugu freedom fighter Uyyalawada Narasimhareddy, Megastar Chiranjeevi recently okayed Koratala Siva's film.

మెగాస్టార్ నెక్ట్స్ మూవీలో ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Posted: 06/04/2018 07:34 PM IST
Megastar chiranjeevi goes on sets with koratala simultaneously with syeraa

మెగా స్టార్ చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం రెండో షెడ్యూల్డ్ రేపటి నుంచి పట్టాలెక్కనుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి నాటికి విడుదల చేయాలని కూడా చిత్ర నిర్మాణ వర్గాలు బావిస్తున్న క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా తెలిసింది. ఒక వైపున సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమాను చేస్తూనే, మరో వైపున కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లడానికి కూడా మెగాస్టార్ రెడీ అవుతున్నారు.

మహేష్ బాబుతో భరత్ అనే నేను చిత్రం గణవిజయం సాధించిన నేపథ్యంలో మంచి కథను రాసుకుని మెగాస్టార్ వద్దకు వెళ్లిన కొరటాలకు.. చిరంజీవి నుంచి పచ్చ జెండా సంకేతం వచ్చిందని.. కథ వినగానే చిరంజీవి కొరటాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అంతేకాదండోయ్.. ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నారని సమాచారం. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరిగిపోతోంది. ఈ సినిమా నేపథ్యం ఎలా ఉండనుంది? చిరంజీవి పాత్ర తీరుతెన్నులు ఎలా వుండనున్నాయి? అనే ఆసక్తి అందరిలోనూ రేకెత్తుతోంది.

ఈ సినిమాలో బిలియనీర్ అయిన ఎన్నారై గాను .. ఓ మారుమూల గ్రామంలోని రైతుగాను రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఇప్పుడు ఈ విషయమే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ రెండు పాత్రలను కూడా కొరటాల అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమై వున్నాడని అంటున్నారు. కొరటాల వరుసగా ఘన విజయాలను అందుకుంటూ వస్తుండటంతో, ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందో చూడాలి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  chiru  Sye Raa  Koratala Siva  surender reddy  dual role  tollywood  

Other Articles