Trouble for Shraddha in cheating case | ఛీటింగ్ కేసులో శ్రద్ధాకపూర్ కి చిక్కులు...

Shradda kapoor legal troubles

Shraddha Kapoor, Legal Troubles, Cheating Case, Haseena Parkar Movie, Shradda Kapoor Case, Saaho Movie Actress

Trouble for Shraddha in cheating case: Court orders inquiry against actress. The court asked the cops submit its report before February 15.

చిక్కుల్లో శ్రద్ధాకపూర్...

Posted: 12/27/2017 04:39 PM IST
Shradda kapoor legal troubles

బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ పై దాఖలైన కేసులో చిక్కులు తప్పేలా కనిపించటం లేదు. హసీనా పార్కర్ చిత్రం కోసం శ్రద్ధా వేసుకున్న దుస్తులను ముంబైకి చెందిన ఓ ప్రముఖ దుస్తుల కంపెనీ డిజైన్ చేసింది. సదరు కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకునే ముందు టైటిల్స్ లో దుస్తుల కంపెనీ పేరు కూడా వేస్తామని నిర్మాత నహిద్ ఖాన్ మాట ఇచ్చారట.

అయితే, సినిమా మొత్తంమీద ఆ కంపెనీ పేరు ఎక్కడా కనబడలేదు. దీంతో, సదరు కంపెనీ యాజమాన్యం నిర్మాత నహిద్ ఖాన్ తో పాటు శ్రద్ధా కపూర్ పై ముంబైలోని అంధేరీ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై  స్పందించిన కోర్టు ఫిబ్రవరి కల్లా నివేదిక సమర్పించాలని కోర్టును ఆదేశించింది.  పోలీసు అధికారులు స్పందిస్తూ, దర్యాప్తు చేసిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. 

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత కథ ఆధారంగా 'హసీనా పార్కర్' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను అపూర్వ లఖియా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. సినిమా పెద్ద హిట్ కాకపోయినప్పటికీ శ్రద్ధాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం సాహోతోపాటే సైనా నెహ్వాల్ బయోపిక్ లో శ్రద్ధాకపూర్ నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles