MAA requested tollywood artists not to commit suicide | విజయ్ సూసైడ్ నేపథ్యంలో సీరియస్ రిక్వెస్ట్ చేసిన మా అసోషియేషన్

Maa seriously reacted on vijay suicide

MAA, Actor Vijay Suicide, Vijay Suicide, Shivaji Raja Vijay Suicide, MAA Actor Vijay Death, Actor Vijay Wife Vanitha

MAA Requested artists over actor Vijay's Suicide. President Shivaji Raja and Suresh request not to commits suicide.

నటుడు విజయ్ సూసైడ్ పై స్పందించిన మా

Posted: 12/11/2017 07:12 PM IST
Maa seriously reacted on vijay suicide

నటుడు విజయ్ ఆత్మహత్య ఘటన టాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది. కారణం ఏదైనా విజయ్ బలవన్మరణంపై పలువురు నటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మా మీడియా సమక్షంలో స్పందించింది. అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఎలాంటి సమస్యలైనా ఉంటే తమతో చెప్పుకోవాలని... అలా కాకుండా ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు.

ఇలాంటి ఘటనల వల్ల నటులపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పారు. గతంలో సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా తాను ఇదే విషయాన్ని చెప్పానని తెలిపారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.

సీనియర్ నటుడు సురేష్ మాట్లాడుతూ, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కుటుంబం మొత్తం తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. నటీనటులకు 'మా' చేయూతను ఇస్తోందని తెలిపారు. ఒత్తిళ్లకు గురైనవారికి అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఇస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MAA  Actor Vijay  Suicide  మా  నటుడు విజయ్  ఆత్మహత్య  

Other Articles