Nikhil Locks the Horn with Mega Hero | కిర్రాక్ పార్టీ రిలీజ్ డేట్.. నిఖిల్ వర్సెస్ వరుణ్ తేజ్ కన్ఫర్మ్

Telugu content

Kiraak Party Movie, Actor Nikhil Siddarth, Nikhil Varun Tej Movies, Kiraak Party Release Date, Tholi Prema Kiraak Party Movie

Young actor Nikhil's Next Kiraak Party Movie Released Date Confirmed. Samyuktha Hegde, Simran Pareenja are the female leads in Kirrak Party and the makers are in plans to release it on February 9th all over. Mega Prince Varuntej already announced that his romantic outing Tholi Prema will release on February 9th. Now Nikhil will lock horns with Varuntej during February.

నిఖిల్ కిర్రాక్ పార్టీ రిలీజ్ డేట్ ఫిక్స్

Posted: 12/09/2017 06:13 PM IST
Telugu content

నిఖిల్ హీరోగా నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తోన్న ఈ సినిమా, కన్నడలో సూపర్ హిట్ అయిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమాకి తెలుగులో 'కిరాక్ పార్టీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

కాలేజ్ క్యాంపస్ లో జరిగే రాజకీయాలు .. వాటి పరిణామాలకి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. డిఫరెంట్ లుక్ తో నిఖిల్ కనిపించే ఈ సినిమాలో ఆయన సరసన, సంయుక్త హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు.

వరుణ్ తేజ్ ఫిబ్రవరి 9నే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకోవైపు మంజుల డైరెక్షన్ డెబ్యూ మూవీ మనసుకు నచ్చింది కూడా దాదాపు అదే తేదీని ఫిక్స్ చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో పోటీ ఎలా ఉండబోతుందోనన్న చర్చ ఇప్పటి నుంచే మొదలైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles