Prabhas will get married soon says Gopichand రిలాక్స్.. బాహుబలికి అప్పుడే పెళ్లా..?!

Gopichand on his friend prabhas marriage

gopichand on prabhas marriage, baahubali friend on prabhas marriage, prabhas marriage, oxygen movie promotion work, oxygen, gopichand, prabhas, marriage, rasi khanna, oxygen, tollywood, bollywood

Now Macho hero Gopichand on the eve of his new film Oxygen release, made some interesting comments regarding his childhood friend Prabhas' marriage.

ప్రభాస్ త్వరలో ఓ మంచి అమ్మాయిని చూసి..

Posted: 11/27/2017 03:20 PM IST
Gopichand on his friend prabhas marriage

తన చిరకాల, చిన్ననాటి మిత్రుడు, యావత్ భారతావనికి బాహుబలిగా సుపరిచితుడైన ప్రభాస్ వివాహం విషయమై హీరో గోపీచంద్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. తన చిన్ననాటి స్నేహితుడు గత ఐదేళ్లుగా బాహుబలి చిత్రంలో నటించడంతో బిజిగా వున్నాడని, అందుచేతనే తన పెళ్లి అంశాన్ని అప్రస్తుత విషయంగా పక్కనబెట్టాడని అన్నాడు. ఇక బాహుబలి చిత్రం పూర్తై కొంత రిలాక్స్ గా వున్న నేపథ్యంలో అయన పెళ్లి చేసుకుంటాడని అసక్తికర కామెంట్లు చేశాడు.

అంతేకాదు త్వరలోనే ఓ మంచి అమ్మాయిన చూసి పెళ్లి చేసుకుంటాడని గోపిచంద్ వెల్లడించాడు. దీనిపై అంటే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడా..? అంటూ కొందరు..? బాహుబలికి అప్పుడే పెళ్లేంటీ..? అని కొందరు తమ తమ అభిప్రాయాలను వెలిబుద్చుతున్నారు. కాగా తాను నటించిన 'ఆక్సిజన్' చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న గోపీచంద్, మీడియాతో మాట్లాడుతూ ప్రబాస్ పెళ్లి విషయంలో అసక్తిగొలిపే వ్యాక్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

'ఆక్సిజన్' చిత్రం వెనుక ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఉన్నారని నమ్మి చేశానని, ఈ సినిమా తనలో ఆక్సిజన్ ను నింపుతుందని భావిస్తున్నానని చెప్పాడు. గతంలో విజయం సాధిస్తుందని నమ్మి చేసిన 'సౌఖ్యం' వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, కథ బాగుండి, సెట్స్ పైకి వెళ్లిన తరువాత మారిపోవడమే ఇందుకు కారణమని అన్నాడు. ఆ తప్పును వేరేవాళ్లపై రుద్దే ప్రయత్నాలను తాను చేయబోవడం లేదని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopichand  prabhas  marriage  rasi khanna  oxygen  tollywood  bollywood  

Other Articles

Today on Telugu Wishesh