Telugu Actress Mallika Passes Away | నటి కమ్ యాంకర్ మల్లిక అనారోగ్యంతో కన్నుమూత

Actress mallika passes away

Actress Mallika, Telugu Anchor Mallika, Telugu Actress Mallika, Mallika Died, Mallika Passes Away, Kalisundam Ra Mallika Died

Telugu Characteristic Artist Mallika Passes Away. She Was Suffers with Serious Illness since last few days.

నటి మల్లిక కన్నుమూత

Posted: 10/09/2017 03:32 PM IST
Actress mallika passes away

తెలుగు బుల్లితెర నటి మల్లిక(39) ఇక లేరు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా అనారోగ్యంతో కోమాలోనే ఉన్న ఆమె.. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు.

మల్లిక అసలు పేరు అభినవ. మల్లికగా పేరు మార్చుకుని యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆమె తర్వాత సీరియళ్లు, పలు చిత్రాల్లో కూడా నటించారు. 1997-2004 మధ్య కాలంలో పలు చానళ్లలో ప్రసారమైన పలు కార్యక్రమాలకు ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహేష్ బాబు రాజకుమారుడు.. వెంకటేశ్ కలిసుందాం రా తదితర చిత్రాల్లో నటనతో ఆమె అలరించారు. వివాహం అనంతరం ఆమె సినిమాలకు దూరం అయ్యారు.

చిన్న వయసులోనే ఆమె చనిపోవటం పట్ల సినీ, టీవీ నటీనటులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మల్లిక అంత్యక్రియలు రేపు హైదరాబాద్ లో జరగనున్నాయి. తొలి తరం టీవీ యాంకర్ గా మల్లిక ప్రజాభిమానం చూరగొన్నారు. తెలుగు విశేష్ తరపున ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తు.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles