Shruthi Haasan Not Interested to do Kannada Film / హ్యాట్రిక్ హీరో అయినా శ్రుతి నో ఇంట్రెస్ట్

Shruthi haasan on kannada debut

Shruthi Haasan, Kannada Debut, Dhruva Sarja, Shruthi Haasan Dhruva Sarja

Shruthi Haasan Ope Up About Kannada Debut. No plans of doing Kannada film soon.. and also clarified that not doing movie with Dhruva Sarja.

కన్నడ డెబ్యూ పై శ్రుతి హాసన్ క్లారిటీ

Posted: 10/07/2017 05:36 PM IST
Shruthi haasan on kannada debut

సౌత్ బ్యూటీ శృతీ హాసన్ చేతిలో ఇప్పుడు సరైన సినిమాలే లేవు. కాటమరాయుడు, బాలీవుడ్ లో బహేన్ హోగీ తేరీ చిత్రాలతో నిరాశ ఫలితాలను చవిచూసిన ఆమె ప్రస్తుతం తండ్రి శభాష్ నాయుడు చిత్రంలో మాత్రమే నటిస్తోంది. అయితే త్వరలో కన్నడలో ఆమె డెబ్యూ ఇవ్వబోతుందన్న వార్త గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతోంది.

యువ హీరో ధ్రువ సర్జా తో ఓ సినిమాకు సైన్ చేసిందన్నది శాండల్ వుడ్ వర్గాల సమాచారం. పొగరు చిత్రం కోసమే ఆమెను సంప్రదించారని చెప్పుకున్నారు కూడా. అయితే హ్యాట్రిక్ హీరోతో ఆమె నటించబోతుందన్న వార్త ఆమె అభిమానులకు సంతోషాన్ని ఇవ్వగా.. ఆ వెంటనే ఆమె నీళ్లు చల్లేసింది.

తాను ఇప్పుడు ఎలాంటి చిత్రానికి సైన్ చేయలేదని ఆమె స్పష్టం చేసింది. కన్నడ చిత్రం కోసం తనను సంప్రదించారన్న వార్త వాస్తవమేనని.. కానీ, దానికి ఓకే చెప్పలేదని.. అసలు కన్నడలో ఇప్పట్లో నటించాలన్న ఉద్దేశం తనకు లేదని ఆమె చెప్పేసింది. కాగా, సౌత్, తెలుగు లో రాణించిన హీరోయిన్లు క్రమంగా కన్నడలోనూ నటించటం ఈ మధ్య పరిపాటిగా మారుతోంది. త్రిష, రకుల్, ప్రియమణి.. ఇలా వీరంతా కన్నడలోనూ హిట్లు రుచి చూసిన వాళ్లే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles