Mahesh Babu SPYder Censor Completed | స్పైడర్ సెన్సార్ పూర్తి.. రిపోర్ట్ మాత్రం టాప్ సీక్రెట్ గా.. దేనికి?

Spyder censor details

SPYder Movie, Mahesh Babu, SPYder Censor Report, statutory warnings SPYder Movie, SPYder Movie Report, SPYder Run Time, SPYder Censor Talk Secret

Mahesh Babu's SPYder Movie Censor Completed. Certified U/A.Also has unique distinction of NO disclaimers statutory warnings thru the movie

స్పైడర్ సెన్సార్ పూర్తి.. టోబాకో యాడ్ లేకుండానే...

Posted: 09/18/2017 03:42 PM IST
Spyder censor details

టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు కథానాయకుడిగా స్టార్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కింది 'స్పైడర్' సినిమా. ఈ చిత్రం ఈ నెల 27న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ టైం మహేష్ కెరీర లో ఇప్పటిదాకా హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ బైలింగువల్ చిత్రం రూపుదిద్దుకుంది. ఆ తేదీ కోసం మహేశ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో అసలు వ్యవహారం పూర్తి చేసేసుకుంది.

నేడు ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు యు/ఎ సర్టిఫికెట్ ను మంజూరు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సిగరెట్, మద్యపానం కు సంబంధించిన వార్నింగ్ యాడ్ లేకుండానే చిత్రం ప్రదర్శితం కాబోతుంది. సినిమాలో అందుకు సంబంధించిన సన్నివేశాలు లేకపోవటంతోనే సెన్సార్ బోర్డు అందుకు ఓకే చేసినట్లు సమాచారం. ఇక రన్ టైం వచ్చి 2 గంటల 25 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్లు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్లకు .. ట్రైలర్ కి .. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి. రకుల్ హీరోయిన్ గా, తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య ప్రేమిస్తే ఫేమ్ భరత్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు .. తమిళ భాషలతో పాటు అరబిక్ భాషలోను విడుదలవుతుండటం విశేషం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles