బాలయ్య 102.. కాస్ట్ లీ హీరోయిన్ జాయిన్ అయ్యింది | Costly Heroine Joined in Balayya 102 Sets

Nayanatara joined 102 movie shoot

Nayanatara, Balakrishna, 102 Movie, Balayya 102 Movie Ramoji Film City, Nayanatara South Costly Heroine, South Heroine Nayanatara Balakrishna, Balakrishna New Movie

Nayanatara join Balakrishna's 102 movie sets. The Movie shooting already progress at Ramoji Film City.

బాలయ్య 102 షూటింగ్ లో జాయిన్ అయిన నయన్

Posted: 08/21/2017 12:27 PM IST
Nayanatara joined 102 movie shoot

యూత్ హీరోలతో పోటీగా అగ్రహీరో నందమూరి బాలకృష్ణ సినిమాల విషయంలో పోటీ పెంచేశారు. ఇప్పటికే 101 పైసా వసూల్ రిలీజ్ రెడీ చేసిన బాలయ్య, తన 102వ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. కోలీవుడ్ సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మళ్లీ ఫాక్షన్ బాలయ్యను చూపించబోతున్నట్లు చెప్పేశాడు కూడా.

ఇక సినిమా కోసం నయనతారను హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు ఈ సినిమా షూటింగులో నయనతార జాయిన్ అయింది. గతంలో బాలకృష్ణ .. నయనతార కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. ' శ్రీరామ రాజ్యం' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. ఆ సెంటిమెంట్ కారణంగా మళ్లీ నయన్ నే సెలక్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని రోజులుగా జరుగుతోన్న ఫస్టు షెడ్యూల్ షూటింగులో .. కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, యాక్షన్ సీక్వెన్స్ ను కూడా చిత్రీకరిస్తున్నారు.

తమిళ .. మలయాళ భాషల్లో బిజీగా వున్న నయనతార, ఈ సినిమా కోసం పారితోషికంగా భారీ మొత్తమే తీసుకుందనే టాక్ వినిస్తోంది. బాలకృష్ణ సినిమా తరువాత ఆమె చిరంజీవితో చేయబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  102 Movie  KS Ravikumar  Nayanatara  

Other Articles