ఆ ఆరుగురు చాలా అసభ్యంగా ప్రవర్తించారు : ఇలియానా | Ileana Reveals Chilling Details about Eve Teasing

Ileana lashes out at fan for misbehaving with her

Ileana D'Cruz, Ileana D'Cruz Eve Teasing, Ileana D'Cruz Fans Mis Behave, Ileana D'Cruz Twitter, Ileana D'Cruz Molestation, Ileana D'Cruz Horrible Experience

Ileana D'Cruz reveals horrifying details of eve teasing by six men in Twitter. Lashes out at male fan who misbehaved with her.

ఈవ్ టీజింగ్ గురించి ఇలియానా

Posted: 08/21/2017 12:51 PM IST
Ileana lashes out at fan for misbehaving with her

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా బాలీవుడ్ ఛాన్సులంటూ అక్కడికి ఎగిరి పోయింది. ఆపై మిగతా హీరోయిన్లలాగానే టాలీవుడ్ పై కొన్ని కారు కూతలు కూసేసింది. అయితే బాలీవుడ్ లో సక్సెస్ మంత్ర దక్కకపోవటంతో తిరిగి లైఫ్ ఇచ్చిన ఇక్కడికే వచ్చేందుకు బాగా ప్రయత్నాలు చేసింది కూడా.

ఇక తాజాగా ఇలియానాకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆదివారం సాయంత్రం ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్ కార్యక్రమానికి వెళ్తున్న ఆమెను కొంత మంది ఈవ్ టీజింగ్ చేశారంట. ఆ భయానక అనుభవాన్ని తన ట్విట్టర్ లో వివరించింది గోవా బ్యూటీ. 'మనం నివసిస్తున్నది చాలా సంకుచితమైన, అల్పమైన ప్రపంచం. నేనొక పబ్లిక్‌ ఫిగర్‌ ని. బహిరంగ ప్రదేశాల్లో నాకు పెద్దగా వ్యక్తిగత జీవితం ఉండదని తెలుసు. కానీ, అంతమాత్రాన నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో అభిమాన వికారాలను నాపై చూపకండి. అంటూ ట్వీట్ చేసింది.

చివర్లో సెలబ్రిటీని కావొచ్చు.. కానీ, నేనూ ఒక మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కారులో వెళ్తున్న తనని చూసి సిగ్నల్ వద్ద అసభ్యంగా ప్రవర్తించారని, కొద్ది దూరం ఫాలో కూడా అయ్యారని ఆమె తెలిపింది. అందులో ఒకడు కారు టాప్ ఎక్కి అరుస్తూ పిచ్చిగా ప్రవర్తించాడని వెల్లడించింది. అయితే వారిని ఫోటోలు, వీడియోలు తీస్తే మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందన్న ఉద్దేశ్యంతో వెనకంజ వేసినట్లు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana D'Cruz  Eve Teasing  Twitter  

Other Articles