Worst Talk for Salman Kahn Tubelight Movie

Salman fans upset with tubelight movie

Salman Khan, Tubelight Review, Tubelight Mini Review, Tubelight Worst Movie, Salman Khan Fan Tubelight, Tubelight Troll, Tubelight Rating

Worst Reports for Salman Khan Tubelight Movie. Even If Not A Salman Khan Fan can't bare it twitter trolled.

ట్యూబ్ లైట్ రివ్యూ: ప్చ్... సల్మాన్ కూడా సేవ్ చేయలేకపోయాడు

Posted: 06/23/2017 03:25 PM IST
Salman fans upset with tubelight movie

బాలీవుడ్ కలెక్షన్ కింగ్ సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ గ్రాండ్ గా ఇవాళ రిలీజైంది. ప్రతీ ఈద్ కు ఫ్యాన్స్ కు గిప్ట్ ఇచ్చే సల్మాన్ మరీ ఈసారి అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇచ్చాడో ఈ మినీ రివ్యూ లో
చూద్దాం.

టాక్ విషయానికొస్తే సినిమా చూసిన వారంతా సల్మాన్ నిరాశపరిచాడంటున్నారు. మంద బుద్ధి ఉన్న వ్యక్తిగా సల్మాన్ నటన మెప్పించినప్పటికీ, కథలో అసలు పసలేదనే తేల్చేస్తున్నారు. లక్ష్మణ్(సల్మాన్), భరత్(సోహైల్) అనే అన్నదమ్ములు, వార్ కోసం సోదరుడు సరిహద్దులకు వెళ్లటం, ట్యూబ్ లైట్ అంటూ జనాల చేత ఛీత్కారం ఎదుర్కునే లక్కీ ఏకంగా యుద్ధాన్నే ఆపటానికి వెళ్లటం, చివరకు ఏమైంది అన్నదే కథగా ఉంది.

వార్ సీన్లు, భారీ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైనా కబీర్ ఈసారి దారుణంగా ఫేలయ్యాడు. సందేశం వరకూ ఓకే అయినా.. సినిమాలో ఫీల్ అయ్యేలా లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. బలమైన స్క్రిప్ట్ లేకపోవటం పెద్ద మైనస్ గా మారిందని చెబుతున్నారు. సల్మాన్ యుద్ధాన్ని ఆపే యత్నాలు మరీ కామెడీగా ఉన్నాయని తేల్చేశారు. షారూఖ్ గెస్ట్ రోల్ కూడా పెద్దగా ఫ్లస్ కాలేకపోయింది.

తరుణ్ ఆదర్శ్ లాంటి ట్రేడ్ అనాలసిస్ట్ కూడా సల్మాన్ లాంటి పవర్ ఉన్నా ఆత్మ మిస్సయ్యిందంటూ ట్వీట్ చేయటం విశేషం. మరోపక్క సినీ అభిమానుల సంగతి తర్వాత.. సల్మాన్ అభిమానులకు కూడా సినిమా నచ్చే ఛాన్సే లేదన్న మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. చూస్తుంటే జయహో(స్టాలిన్ రీమేక్) తర్వాత సల్లూ భాయ్ కు ట్యూబ్ లైట్ కే ఇంత బ్యాడ్ టాక్ రావటం గమనార్హం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High expectations on ko ante koti movie
Rajanikanth is the superstar only says dasari  
Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Tubelight  Movie Review  

Other Articles