Rajanikanth is the superstar only says dasari

dasari narayana rao, rajanikanth, rajni is the super star, dasari talks, dasari narayana rao pics, dasari narayana rao movies, dasari narayana rao family, dasari narayana rao congress party

rajanikanth is the superstar only says dasari

11.gif

Posted: 12/20/2012 03:10 PM IST
Rajanikanth is the superstar only says dasari

         దర్శకరత్న దాసరినారాయణ రావు విమర్శనాత్మక ప్రసంగాలు చేయటంలో ముందుంటారు. ఇక  చిత్ర సీమ గురించి ఏమైనా విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు సాగించినా అవి మెగా ఫ్యామిలీని టార్కెట్ చేసేవనే చాలా మంది భావిస్తూ ఉంటారు. అలాంటి ప్రసంగమే ఇవాళ తాజాగా చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ ఎన్టీఆర్ అనీ ... తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అని ... వాళ్లను మించిన స్టార్లు ఎవరూ లేరని దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు.dasari11 రజనీ సూపర్‌స్టార్‌ అన్న విషయాన్ని సినిమా రంగానికి చెందిన వారందరూ ఒప్పుకున్నారని చెప్పారు. ఆయనతో సమానమైన వారు మరొకరు లేరని వ్యాఖ్యానించారు. దర్శకుడు సురేష్‌కృష్ణ రాసిన 'బాషాతో నేను' పుస్తకాన్ని దాసరి ఇవాళ హైదరాబాద్ లో ఆవిష్కరిస్తూ ఈ మాటలు అన్నారు. అంతేకాదు.. రజనీకాంత్ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని గురించి ప్రస్తావించారు. అసలైన సూపర్ స్టార్ అంటే ఆయనేనంటూ ప్రశంసించారు. రజనీకాంత్ చేసిన సాయాన్ని మరిచిపోతాడు కానీ, పొందిన సాయాన్ని మరిచిపోడంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
         తన సిఫారసుతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరిన వాళ్లు.. వేషాల కోసం తన ఇంటి చుట్టూ సైకిల్ పై తిరిగిన వాళ్లు ఈ రోజున తనని సవాల్ చేసే స్థాయికి చేరుకున్నారని ఉద్వేగంగా అన్నారు. తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ కొందరిని స్టార్ల ని చేస్తే, వాళ్లు తనని అవమానపరిచారని చెప్పారు. ఎండుగడ్డి కూడా మొలవని స్టూడియోల్లో పచ్చగడ్డి మొలిపించాననీ, అలాంటి స్టూడియో లోంచి తనను వెళ్ళగొట్టారనీ దాసరి ఆవేదనతో అన్నారు. అలాంటి వారందరి చరిత్రలను పుస్తకాలుగా రాస్తాననీ, నిజాలు అందరికీ తెలియజేయడమే తన ఉద్దేశమని ఆయన అన్నారు. చిరంజీవిని, అక్కినేనిని టార్గెట్ చేసే దాసరి ఈ వ్యాఖ్యలు చేశారని గుసగుసలు అప్పుడే ఇండస్ట్రీలో చెలరేగాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles