Kangana Ranaut reacts to Vidya Balan's Credit Comments

Vidya balan instagram pic satire to kangana

Vidya Balan, Kangana Ranaut Simran Controversy, Kangana Ranaut Vidya Balan Jibe, Vidya Balan Jibe, Vidya Balan Credit Comments, Kangana Additional Credit Comments

Vidya Balan Credit Jibe at Kangana Ranaut. When asked Kangana about Vidya's dig, she quipped, "Haha I read about that. Vidya is a dear friend and honestly, I am not a thin-skinned person when it comes to people taking digs or jibes at me."

కంగనా వర్సెస్ విద్యాబాలన్.. ఏం జరుగుతోంది?

Posted: 05/29/2017 02:49 PM IST
Vidya balan instagram pic satire to kangana

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నటి కంగనా రనౌత్ మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. కాఫీ విత్ కరణ్ షో లో హీరోల డామినేషన్ తో మొదలుపెట్టిన కంగనా వ్యాఖ్యలు.. తాజా చిత్రం సిమ్రన్ రైటర్ అపూర్వ అసరాని కంటే ముందు తన పేరు అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్ అంటూ వేయాలంటూ చేసిన రాద్ధాంతం.. ఆపై అపూర్వ కంగనా పేరు ప్రస్తావించకుండా బాలీవుడ్ లో డామినేషన్ గురించి ఓ సుదీర్ఘ పోస్ట్ ను ఉంచటం ఇలా... కాంట్రవర్సీలతోనే కంగానా కెరీర్ సాగుతోంది.

ఇదిలా ఉంటే కంగాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ విద్యాబాలన్ పెట్టిన ఓ పోస్ట్ పై బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. తన అప్ కమింగ్ మూవీ తుమ్హారి సులు దర్శకుడు సురేష్ త్రివేణి తనకు ఓ క్రెడిట్ కార్డు ఇచ్చాడంటూ ఫోటోను పెట్టింది. దాని మీద అడిషినల్ క్రెడిట్ కార్డు అని క్లియర్ గా రాసి ఉంది. బాలన్ అడిగితేనే ఇచ్చి ఉంటాడేమో నంటూ నిర్మాత తనుజ్ గార్గ్ ఆ పోస్ట్ కు కామెంట్ పెట్టాడు. ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది.

ఈ చిత్రంతో ఏ మాత్రం సంబంధం లేని, సిమ్రన్ రైటర్ అపూర్వ కూడా ఫోటోపై రియాక్ట్ అయ్యాడు. క్రెడిట్ అనేది ఇస్తే తీసుకోవాలని బలవంతంగా లాక్కోవద్దంటూ ఓ రిప్లై ఇచ్చాడు. ఇది కంగనాకే కౌంటర్ అని పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు కదా. దీనికి రంగూన్ బ్యూటీ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి మరి.


విద్యా కామెంట్స్ ను పట్టించుకోను...

కాగా, విద్యాబాలన్ క్రెడిట్ కామెంట్లపై కంగనా రియాక్ట్ అయ్యింది. ఓ ప్రముఖ మాగ్జైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటిని లైట్ తీసుకుంటున్నట్లు పేర్కొంది. విద్యా నా బెస్ట్ ఫ్రెండ్. తను చేసిన కామెంట్లను నెగటివ్ గా చూడాల్సిన అవసరం నాకు లేదంటూ స్పందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vidya Balan  Credit Comments  Kangana Ranaut  

Other Articles

Today on Telugu Wishesh