RGV Says Good Bye To Twitter వివాదాస్పద అర్జీవి సంచలన నిర్ణయం..

Ram gopal varma says good bye to twitter

ram gopal varma twitter, ram gopal varma quits twitter, rgv quits twitter, rgv twitter. rgv new series. rgv guns and thighs, rgv web series, bollywood news, ram gopal varma, twitter, rgv twitter. instagram, guns and thighs, tollywood, entertainment

Filmmaker Ram Gopal Varma is no longer on Twitter but before leaving the micro-blogging site, he announced that he will be active on Instagram.

వివాదాస్పద అర్జీవి సంచలన నిర్ణయం..

Posted: 05/28/2017 10:18 AM IST
Ram gopal varma says good bye to twitter

వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సెన్సెషనల్ చిత్రాలను తీయడమే కాదు.. అలాంటి నిర్ణయాలను కూడా చటుక్కున తీసుకుంటారు. తాజాగా అలాంటి నిర్ణయమే తీసుకుని ఆయన తన అభిమానులను హర్ట్ చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఎంటరై.. అక్కడ కూడా తన సత్తాను ప్రూప్ చేసుకున్న ఆర్జీవీ.. ఈ మధ్యకాలంలో మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయారు. ఈ క్రమంలో ఆయన తన మాటల కన్నా.. పిట్ట కూతతోనే పలువురి నుంచి విమర్శలను ఎదుర్కోంటూ వివాదాస్పదమయ్యారు. అదేనండీ ట్విట్టర్ ఆయనకు అభిమానులతో షేర్ చేసుకునే విషయాలకు బదులు సినిమాల నుంచి రాజకీయాల వరకు చివరాఖున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై కూడా ట్విట్లు చేశారు.

అలాంటి వర్మ తన తాజా ట్విట్ తో గుడ్ బై చెప్పేశారు. "ఇదే నా చివరి ట్వీట్. పుట్టింది: 27-5-2009, మరణం: 27-5-2017"... అంటూ సంచలన ట్వీట్ తో ఆయన తన అభిమానులను హర్ట్ చేశారు. ఇక మీదట ట్విట్టర్ వాడబోవడం లేదని, కేవలం ఇన్ స్టాగ్రామ్ ను మాత్రమే వాడతానని స్పష్టం చేశారు. ఇకపై తన అభిప్రాయాలను, భావాలను ఫోటోలు, వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటానని అన్నాడు. ఇంతకాలం తనను ఫాలో అవుతూ వచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పాడు. ఆపై తన ట్విట్టర్ ఖాతాను తొలగించాడు. ఇప్పుడు వర్మ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేస్తే, 'సారీ, దట్ పేజ్ డజన్ట్ ఎగ్జిస్ట్' అన్న మెసేజ్ కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  twitter  rgv twitter. instagram  guns and thighs  tollywood  entertainment  

Other Articles