Deepika Padukone to play PV Sindhu in her biopic

Deepaika padukone in pv sindhu biopic

PV Sindhu Biopic, PV Sindhu Biopic Actress, PV Sindhu Biopic Sonu Sood, PV Sindhu Deepika Padukone, Saina Nehwal PV Sindhu Biopics, Sonu Sood Deepika Padukone, Deepika Padukone Biopic, Deepika Padukone PV Sindhu, Saina Nehwal Shradda Kapoor, Saina Nehwal Movie

Deepika Padukone almost confirmed in PV Sindhu Biopic. Actor, Producer Sonu Sood Not Yet Confirmed It.

పీవీ సింధు బయోపిక్ లో దీపిక దాదాపు కన్ఫర్మ్

Posted: 05/01/2017 04:18 PM IST
Deepaika padukone in pv sindhu biopic

తెలుగు తేజం, ఒలంపిక్స్ సిల్వర్ మెడల్ విజేత పీవీ సింధు బయోపిక్ కు అంతా సిద్ధమైంది. ఇప్పటికే నటుడు సోనూ సూద్ నిర్మాణ హక్కులను చేక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే సింధును కలిసిన సోనూ సినిమాకు కావాల్సిన అన్ని అనుమతులు తీసేసుకుని త్వరలో షూటింగ్ ప్రారంభించేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు సమాచారం.

ఇక సింధు పాత్ర కోసం తీసుకోబోయే నటి విషయంలో కూడా ఆల్ మోస్ట్ క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ నటి దీపికా పదుకునే ను దాదాపు ఫైనలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సింధు రోల్ పొడగరి, పైగా బ్యాడ్మింటన్ లో అనుభవం ఉన్న దీపిక అయితేనే బావుంటుందని సోనూ కూడా ఓ అభిప్రాయానికి వచ్చినట్లు భోగట్టా.

ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన ప్రకాశ్ పదుకునే తండ్రి కావటంతో చిన్నప్పటి నుంచి ఆ ఆటలో పీకూకు ప్రావీణ్యం ఉంది. అంతేకాదు నటి కాకముందు నేషనల్ లెవల్ లో మ్యాచ్ లు కూడా ఆడిన అనుభవం ఆమెకు ఉంది. ఇంకోపక్క సైనా నెహ్వల్ లైఫ్ పై అమోల్ గుప్తా ఓ బయోపిక్ కి ఫ్లాన్ చేశాడు. దీంట్లో తొలుత నెగటివ్ రోల్ కోసం దీపికను సంప్రదించి చివరకు శ్రద్ధ కపూర్ ను ఫైనలైజ్ చేశాడు. దీంతో మాగ్జిమమ్ సింధు బయోపిక్ లో దీపికనే లీడ్ అయ్యే అవకాశాలున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Biopic  Deepika Padukone  Sonu Sood  

Other Articles