హాట్ టాపిక్ గా హీరోయిన్ సైడ్ బిజినెస్... | Actress Puts Her Money in Juice-making.

Jacqueline fernandez invests in juice start up rakyan beverages

Jacqueline Fernandez, Jacqueline Fernandez Business, Jacqueline Fernandez Rakyan Beverages, Actress Side Business, Rakyan Beverages Jacqueline Fernandez, Jacqueline Business, Jacqueline Juice Business

Bollywood Actress Jacqueline Fernandez Invests In Juice Start-Up Rakyan Beverages.

బిజినెస్ లోకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్

Posted: 04/17/2017 12:48 PM IST
Jacqueline fernandez invests in juice start up rakyan beverages

ఓవైపు సినిమాలతోనే కాదు, సైడ్ బిజినెస్ లతో కూడా మన హీరోయిన్లు రెండు చేతులా సంపాదించేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్ లు ఇలా ఒక్కోక్కరు ఒక్క దాంట్లో బాగానే వెనకేసుకుంటున్నారు. షూటింగ్ తో గ్యాప్ దొరికితే మాత్రం వాటిపైనే దృష్టిసారిస్తూ కెరీర్ లో ఖాళీ లేకుండా పోతున్నారు. అఫ్ కోర్స్ దీనిని కూడా మనం హాలీవుడ్ నుంచే ఇన్సిపిరేషన్ తీసుకున్నామనుకోండి.

హాలీవుడ్ లో పాపులర్ సింరర్ కమ్ నటి మడోన్నా కోకనట్ వాటర్ తో, బేవన్స్ పుచ్చకాయ జ్యూస్ తో పిచ్చ పాపులర్ అయిపోయారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఓ హీరోయిన్ ఇలా జ్యూస్ లతోనే సంపాదించేందుకు సిద్ధమైపోయింది.

కిక్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ రాక్యాన్ బెవెరేజెస్ అనే ఓ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టింది. 120 కోట్ల విలువ ఉన్న ఈ కంపెనీలో మూడున్నర కోట్ల సొమ్మును ఈ లంక బ్యూటీ ఇన్వెస్ట్ చేసిందని సమాచారం. ఫ్రూట్ జ్యూస్ రంగంలో నాణ్యతకు మారు పేరైన ఈ కంపెనీలో పెట్టుబడులు ఎంతో సంతోషాన్ని కలిగించిందని మర్డర్ 2 ఫేం నటి చెబుతోంది. ఇప్పటికే భారీ లాభాల్లో ఉన్న ఈ కంపెనీ త్వరలో ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేసి ఇండియాలో ప్రచారం చేసేందుకు సిద్ధమైపోతుంది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jacqueline Fernandez  Business  Rakyan Beverages  

Other Articles