రజనీ ఒక్కటే.. కానీ, కమల్ రెండు... ఏం అవుతుందో? | Kamal Haasan follow Rajinikanth digitization thought.

Kamal haasan two films re released soon

Vetri Vizha and Meendum Kokila, Kamal Haasan Old Movies, Kamal Haasan Digitization, Kamla Movies Digital Version, Digitally Kamal Movies, After Baasha Kamal Two Movies, Kamal Haasan Classical Movies, Kamal Re Release

Senior Actor Kamal Haasan two classic hits re released big screen soon. Vetri Vizha, Meendum Kokila digitally versions may release in this June.

కమల్ రెండు సినిమాలు మళ్లీ వస్తున్నాయ్

Posted: 04/17/2017 02:30 PM IST
Kamal haasan two films re released soon

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ ను ఓ మలుపు తిప్పి స్టార్ డమ్ ను కట్టబెట్టిన చిత్రం భాషా. మాస్ లో రజనీ ఇమేజ్ పెంచి కంట్రీ వైడ్ గుర్తింపు వచ్చేలా చేసిందా మాఫియా డ్రామా. అందుకే దానికి కలరింగ్ ఇచ్చి డిజిటల్ వర్షన్ లో మళ్లీ రిలీజ్ చేశారు. పెద్దగా హడావుడి లేకుండా లిమిట్ స్క్రీన్ లోనే రిలీజ్ చేసి మంచి ఫలితం రాబట్టారు.

సరిగ్గా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఇదే పద్ధతిని ఫాలో కాబోతున్నాడు. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ పాత రెండు చిత్రాలను త్వరలో డిజిటలైజేషన్ చేసి రీ రిలీజ్ చేయబోతున్నారు. 80వ దశకంలో కమల్, ప్రభు కలిసి నటించిన హిట్ మూవీ వెట్రి విజా, మిందుమ్ కోకిల చిత్రాలకు డార్విన్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ కొత్త రంగులు దిద్దుతోంది.

Kamal Two Classics Re Release

జూన్ నెలలో ఈ రెండు చిత్రాలను బ్యాక్ టూ బ్యాక్ 200 స్క్రీన్లకు పైగానే రిలీజ్ చేయబోతున్నారంట. అయితే భాషా ను కేవలం 50 ఎంపిక చేసిన స్క్రీన్లలో రిలీజ్ చేయగా, కమల్ సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తుంటం విశేషం. భాషా రిరిలీజ్ హిట్ తో ఇంటర్నేషనల్ స్టార్  జాకీ చాన్ కూడా సాధించలేని ఫీట్ ను తలైవా సాధించాడని గొప్పగా చెప్పుకున్నారు. మరి కమల్ కూడా ఆ మ్యాజిక్ ను కొనసాగిస్తాడేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Vetri Vizha  Meendum Kokila  Digital Version  Re Release  

Other Articles