రాజమౌళి అంతలా ఏడవటానికి రీజన్ రానానేనంట! Rana reason for Rajamouli tears.

Emotional rajamouli thanks tweets to baahubali team

Emotional Rajamouli, Rajamouli Emotional Tweets, Rajamouli Twitter, Rajamouli Cry, Rajamouli Tears, Rajamouli Miss Pre Release Event, Rana Rajamouli, Rajamouli Cry

Emotional Rajamouli Thanks to Prabhas, Rana Daggubati And Karan Johar For Being A Part Of His Film.Baahubali 2 director SS Rajamouli is at a loss of words while praising Prabhas and Tweets about all cast and crew.

రాజమౌళి మళ్లీ ఓపెన్ అయ్యాడు

Posted: 03/28/2017 10:03 AM IST
Emotional rajamouli thanks tweets to baahubali team

బాహుబలి ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకధీరుడు రాజమౌళి చాలా విషయాలనే చెప్పుకుండా వదిలేశాడన్న సందేహాలు కలిగాయి. ముఖ్యంగా రానా గురించి స్పందించకపోవటం, సింగర్ల ప్రస్తావన తేకపోవటంతో కావాలనే చేశాడా? అన్నట్లు కొందరు కథనాలు రాశారు. అయితే నిర్దేశిత సమయం పూర్తి కావటం, కార్యక్రమాన్ని ముగించాలని పోలీసులు కోరడంతో తాను అనుకున్నది మాట్లాడలేకపోయినంటున్నాడు జక్కన్న. ఈ మేరకు నిన్న తన ట్విట్టర్ లో తానే స్టేజీ మీద ఏవైతే ఎక్స్ ప్రెస్ చేయలేకపోయాడో వాటి గురించి స్పందించాడు.

ఎంతమంది ప్రేక్షకులు వచ్చినా, ఎవరికీ ఇబ్బంది కలుగకుండా, మర్యాదగా అందరినీ హ్యాండిల్ చేసిన జీ4ఎస్ బృందానికి రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజ్ క్రాఫ్ట్ ఎంతో పకడ్బందీగా నిర్వహించిందని అన్నారు. టైమింగ్ లో ఫైర్ వర్క్స్ పేల్చటం, కార్యక్రమాం కలర్ ఫుల్ సాగేందుకు 100 శాతం న్యాయం చేసిన ఆనంద్ ను ప్రత్యేకంగా అభినందించాడు. ఇక గత ఐదేళ్లలో తాను ఏది అడిగితే దాన్ని సమకూర్చిన యోగానంద్ కు, అద్భుతమైన చిత్రం తయారు కావడానికి సహకరించిన వీఎఫ్ఎక్స్ విభాగాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇక అనుష్కను 'స్వీటీ' అని సంబోధిస్తూ, తన చిత్రంలో నటించినందుకు పొగడ్తల వర్షం కురిపించారు. మొదటి భాగంలో అనుష్కను అందంగా చూపించలేకపోయానని, రెండో భాగంలో ఆమెను చూసి అభిమానులు ఆనందిస్తారని చెప్పుకొచ్చాడు. చివరి రోజు షూటింగ్ లో ఎమోషనల్ గానీ రానా, స్టేజీ మీద ఇచ్చిన స్పీచ్ కు డ్యామ్ గేట్లు ఎత్తేసినట్లు తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ గురించి చెప్పటానికి తన దగ్గర పదాలు లేవన్న దర్శకధీరుడు తన ఇంటర్వ్యూలు ఆ విషయాన్ని వెల్లడిస్తాయన్నాడు. చివరగా.. కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవ గురించి స్పెషల్ గా ప్రస్తావిస్తూ తనను చేతులతో ఎత్తుకుని పెంచానని, ఇప్పుడు తండ్రిని మించిన సింగర్ అయ్యాడంటూ ప్రశంసలు కురిపించాడు. మొత్తానికి కూల్ గా ఐదేళ్లపాటు బాహుబలి జర్నీని కెప్టెన్ గా ముందుండి నడిపించిన రాజమౌళి ఇలా ఎమోషనల్ అది ముగియటంతో అంతలా ఎమోషనల్ అయ్యాడని అర్థమౌతోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director Rajamouli  Pre Release Event  Emotional Tweets  

Other Articles