లీకైన వీడియో పై సూర్య క్లారిటీ. అతనేనంట. కానీ... | suriya clarity on visit to Mosque goes viral.

Suriya has not converted to islam

Actor Suriya, Suriya Caste Convert, Actor Suriya Islma, Actor Suriya Mosque Video, Suriya Islam Costumes, Suriya Traditional Avatar, Ameen Peer Dargah Suriya, Suriya AR Rahman

Actor Suriya says that he visited mosque to pray, not convert. AR Rahman invited him to participate special event conducted at Ameen Peer Dargah.

నేను మతం మారలేదు-సూర్య

Posted: 03/28/2017 11:34 AM IST
Suriya has not converted to islam

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఓ వీడియో లీక్ అయ్యింది. అంతే దానిపై లేనిపోని పుకార్లు రాసేసింది కోలీవుడ్ మీడియా. అక్కడితోనే అది ఆగలేదు. దానికి కారణాలు వెతుకుతూ మరిన్ని స్టోరీలను కంటిన్యూ చేసింది. దాంట్లో ఏ మాత్రం నిజం లేకపోవటంతో సూర్యకి చిర్రెత్తుకొచ్చింది. అందుకే సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది. ఆ వీడియోలో ఏముందో చూద్దాం.

ఇస్లాం వేషాధారణలో ఉన్న సూర్య ఓ మసీదులో ప్రార్థనలు నిర్వహించాడు. దీంతో సూర్య మతం మార్చుకున్నాడంటూ ఓ వార్త బయలుదేరింది. అయితే అది నిజంకాదని ఈ స్టార్ హీరో వివరణ ఇచ్చుకున్నాడు. సింగం షూటింగ్ కోసం కడప వెళ్లాను. అప్పుడు సంగీత దర్శకుడు కడప దర్గాకు వచ్చాడు. అతని ఆహ్వనం మేరకు నేను అక్కడికి వెళ్లాను. సాంప్రదాయ ప్రార్థనల్లో పాల్గొన్నాక అక్కడ నిర్వహించిన వేడుకలో పాల్గొన్నాను, నిజానిజాలేంటో తెలీకుండా వార్తలు రాసేయటం మంచింది కాదని క్లారిటీ ఇచ్చేశాడు.

ఇక గత కొంతకాలంగా హిట్ లేని సూర్య సింగం-3 తో అయినా అది అందుకుంటాడని భావించారు. అయితే రిజల్ట్ మాత్రం తేడా కొట్టడంతో ఢీలా పడిపోయాడు. ఇప్పుడు సూర్యకి ఓ బ్లాక్ బస్టర్ అవసరం. అందుకే యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో తానా సెర్తనా కూటమ్ అనే మూవీ లో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా చేస్తుండగా, బాలీవుడ్ మూవీ స్పెషల్ ఛబ్బీస్ కు ఇది రీమేక్ గా ప్రచారం జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Suriya  Caste Convert  Mosque Video  

Other Articles